India Schedule: టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలోనే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో పాల్గొని తొమ్మిదో సారి టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే అలాంటి టీమిండియా మరో 8 నెలల పాటు వరుసగా టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. ఇందులో టెస్టులు అలాగే టి20 లు, వన్డే సిరీస్ లు కూడా ఉన్నాయి. వాటి షెడ్యూల్ ఒకసారి పరిశీలిద్దాం.
అక్టోబర్ మాసం నుంచి జూలై 2026 వరకు టీమిండియా వరుసగా అన్ని రకాల టోర్నమెంట్లు ఆడాల్సి ఉంది. సెప్టెంబర్ మాసంలో ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో పాల్గొని టీమిండియా అదరగొట్టింది. ఈ నేపథ్యంలోనే తొమ్మిదవ సారి టైటిల్ గెల్చుకొని చరిత్ర సృష్టించింది టీమిండియా. ఇక ఈ అక్టోబర్ మొదటి వారంలోనే వెస్టిండీస్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడుతోంది. వెస్టిండీస్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండు టెస్టులు జరగనున్నాయి. ఇప్పటికే ఒకటి పూర్తి అయింది. మరొకటి జరగాల్సి ఉంది.
ఈ సిరీస్ పూర్తికాగానే ఆస్ట్రేలియాకు పయనం కానుంది టీమిండియా. ఈ సందర్భంగా టీం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19 తేదీ నుంచి నవంబర్ వరకు సిరీస్ లు కొనసాగుతాయి. ఇందులో మూడు వన్డేలు అలాగే ఐదు టి20 మ్యాచ్ లు ఉన్నాయి. ఇప్పటికే ఈ టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా టీమ్స్ ను కూడా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండు టెస్టులు, మూడు వన్డేలు అలాగే ఐదు టి20 లు ఉంటాయి. ఈ టోర్నమెంట్ నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో జరుగుతుంది. అలాగే న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేలు అలాగే ఐదు టి 20 మ్యాచ్లు జనవరి 2026 లో ఉంటాయి. ఇక జూలై 2026 లో ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య 5 t20 లు అలాగే 3 వన్డేలు కొనసాగనున్నాయి. ఇక ఫిబ్రవరి మాసంలో టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. మార్చి నుంచి మే వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ జరగనుంది.
అక్టోబర్ నుంచి జూలై 2026 వరకు టీమిండియా ప్లేయర్లు వరుసగా ఇలా టోర్నమెంట్లు వాడుకుంటూ వెళ్తే కచ్చితంగా గాయాల పాలు కావడం గ్యారెంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు. దీనివల్ల భవిష్యత్తులో టీమిండియా పెద్దగా రాణించకపోవచ్చు అని చెబుతున్నారు. ముఖ్యంగా ఐసీసీ టోర్నమెంట్లలో అట్టర్ ప్లాప్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి తక్కువ సిరీస్ లు ఆడిస్తూ, ప్లేయర్లకు కాస్త రిలాక్సియేషన్ ఇవ్వాలని కోరుతున్నారు క్రీడా విశ్లేషకులు.