BigTV English

LB Nagar Metro: ఎల్బీనగర్‌ మెట్రో ఫుల్‌రష్‌.. కిలో మీటర్‌ మేరా లైన్‌, పండుగ తర్వాత తిరుగు ప్రయాణం

LB Nagar Metro: ఎల్బీనగర్‌ మెట్రో ఫుల్‌రష్‌.. కిలో మీటర్‌ మేరా లైన్‌, పండుగ తర్వాత తిరుగు ప్రయాణం

LB Nagar Metro: ఏదైనా పండుగలు వస్తేచాలు.. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. వెళ్లేటప్పుడు మాత్రమే కాదు.. వచ్చేటప్పుడు కూడా రద్దీ కనిపిస్తోంది. తాజాగా దసరా పండుగ తర్వాత ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు ప్రజలు. ఈ క్రమంలో ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక్కసారిగా రద్దీ పెరిగింది. కిలోమీటర్ల మేరా ప్రయాణికులు బారులు తీరారు.


హైదరాాబాద్ మెట్రోలో పెరిగిన రద్దీ

దసరా, సంక్రాంతి వంటి పండుగలు వస్తే చాలు. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారు దాదాపు 10 నుంచి 15 లక్షల వరకు ఉంటారని ఓ అంచనా. వాహనాలు, రైళ్లు, బస్సుల్లో సొంతూళ్లకు చేరుకుంటారు. పండుగ తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కొందరికి టికెట్లు దొరకని పరిస్థితి.  ఏపీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అనుకున్న సమయానికి రాని సందర్భాలు చాలానే ఉన్నాయి.


అందులోనూ ఉదయం నుంచి వర్షం పడడంతో చాలా ప్రాంతాల్లో రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి వచ్చిన చాలామంది ప్రయాణికులు ఎల్బీ నగర్ వద్ద దిగిపోయారు. మెట్రో రైలుని ఆశ్రయించారు. వాహనాలు ఒక్కసారిగా రావడంలో మెట్రో స్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొంది. మెట్రో టికెట్ కోసం ప్రయాణికులు బారులు తీరారు.

దసరా ఎఫెక్ట్.. సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు

కేవలం ఎల్బీనగర్ మెట్రో మాత్రమే కాదు.. మిగతా ప్రాంతాల్లోని మెట్రో స్టేషన్ల ఇదే పరిస్థితి.  మెట్రో ద్వారా ఆఫీసులు, ఇళ్లకు వేగంగా చేరుకోవచ్చని ఆలోచనలో దాన్ని ఆశ్రయించారు. దీంతో రద్దీ పెరిగిపోయిందంటే పరిస్థితి ఏ రేంజ్‌దో ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెద్దకాపర్తి వరకు దాదాపు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

ALSO READ: కుమ్మేస్తున్న వర్షాలు, హైదరాబాద్ లో ఉదయం నుంచి

ఆ రెండు ప్రాంతాల మధ్య వంతెన నిర్మాణం జరుగుతుండడంతో ట్రాఫిక్ రద్దీ అమాంతంగా పెరిగిందని అంటున్నారు. దసరా సెలవుల తర్వాత ఏపీ నుంచి చాలామంది నగర బాట పట్టారు. పంతంగి టోల్ ప్లాజాతోపాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. వాహనాల రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.

మధ్యాహ్నం దాటిన తర్వాత ఇదే పరిస్థితి కంటిన్యూ కావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. ఇదిలాఉండగా హైదరాబాద్‌ సిటీలోని ఎల్బీనగర్‌ చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. చింతలకుంట వంతెనపై ట్రావెల్స్‌ బస్సులు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్‌జామ్‌ కారణంగా ఆఫీసులకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

 

Related News

CM Revanth Reddy: బెంగళూరుకు సీఎం రేవంత్.. అసలు విషం ఇదే

Telangana: స్థానిక సంస్థల ఎన్నికలు.. కేసీఆర్ ప్లాన్‌తో బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ?

Heavy Rains: కుమ్మేస్తున్న వర్షాలు.. హైదరాబాద్‌లో ఉదయం నుంచి, రాబోయే రెండుగంటలు ఆ జిల్లాలకు అలర్ట్

Rains: రాష్ట్రంలో కుండపోత వర్షాలు.. ఈ 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్, భారీ పిడుగులు పడే అవకాశం

Harish Rao: తెలంగాణ అంటే బీజేపీకి ఎందుకింత చిన్నచూపు.. వారు ఉత్తర భారతదేశం పక్షాన మాత్రమే..?: హరీష్ రావు

KTR On RTC Charges: సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచారు.. ఆర్టీసీ ఛార్జీల పంపుపై కేటీఆర్ విమర్శలు

Telangana BJP: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సెంట్రల్ వ్యూహం.. పదాధికారుల సమావేశంలో కీలక దిశానిర్ధేశం

Big Stories

×