నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఆగిపోయింది. ఇంజిన్ లో సాంకేతక సమస్య కారణంగా ప్లాట్ ఫారమ్ నెంబర్ 1 మీద నిలిచిపోయింది. రైల్వే టెక్నికల్ సిబ్బంది వచ్చి ఇంజిన్ ను బాగు చేసే ప్రయత్నం చేసినా, సాధ్యం కాలేదు. ఈ నేపథ్యంలో మరో ఇంజిన్ ను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రామన్నపేట నుంచి మరో రైలు ఇంజిన్ ను తీసుకురానున్నట్లు తెలిపారు.
హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు.. మిర్యాలగూడలోని ప్లాట్ ఫారమ్ నెంబర్ 1 మీదికి రాగానే అనుకోకుండా ఆగిపోయింది. లోకో పైలెట్ ఇంజిన్ ను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించినా, ఆన్ కాలేదు. కాసేపటి తర్వాత ఉన్నతాధికారులు సమాచారం అందించాడు. వెంటనే టెక్నికల్ టీమ్ స్పాట్ కు చేరుకుని ఇంజిన్ ను పరిశీలించారు. అయినప్పటికీ సమస్య సాల్వ్ కాలేదు. ఈ నేపథ్యంలో మరో రైలు ఇంజిన్ ను తీసుకురావాలని భావిస్తున్నారు. అందులో భాగంగా రామన్నపేట నుంచి ఇంజిన్ ను తీసుకురానున్నట్లు వెల్లడించారు.
Read Also: కుండపోత వర్షాలతో పలు రైళ్లు రద్దు.. మీ రైళ్లు ఉన్నాయేమో చెక్ చేసుకోండి!
అటు రైల్లోని ప్రయాణీకుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గంటకు పైగా ప్లాట్ ఫ్లారమ్ మీదే రైలు ఆగడంతో ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు చిరాకు చేయడంతో మహిళలు మరింత ఇబ్బంది పడుతున్నారు. రైలు ఎప్పుడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుందో అధికారులు చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్లోని ప్రయాణీకులంతా కిందికి దిగడంతో స్టేషన్ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. మరోవైపు వీలైనంత త్వరగా రైలును అక్కడి నుంచి పంపించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కనీసం రెండు, మూడు గంటలైనా సమయం పడుతుందని చెప్తున్నారు.
మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయింది. గంటకుపైగా నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.#FalaknumaExpress #train #Miryalaguda #Railwaystation #Hyderabad pic.twitter.com/qSAbBtvBrc
— BIG TV Cinema (@BigtvCinema) October 6, 2025
Read Also: లక్నో నుంచి ముంబైకి జస్ట్ 12 గంటల్లోనే.. వచ్చేస్తోంది వందే భారత్ స్లీపర్!