Vijayawada Crime: విజయవాడలోని భవానీపురం మహిళ హత్య కేసులో ఏం జరిగింది? అసలు నిందితుడు ఎవరు? దగ్గర బంధువే హత్యకు పాల్పడ్డాడా? తన ఫ్యామిలీలో కలహాలకు ఆమె కారణమని భావించి హత్య చేశాడా? అవుననే అంటున్నారు విజయవాడ పోలీసులు. అసలేం జరిగింది? ఇంకా లోతుల్లోకి వెళ్తే..
విజయవాడ మహిళ హత్య కేసు
విజయవాడ సిటీలో భవానీపురం ప్రాంతంలో 65 ఏళ్ల మహిళ హత్య కేసు చిక్కుముడి వీడింది. నిందితుడు ఆమెను చంపేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. వేర్వేరు ప్రాంతాల్లో మహిళ శరీర భాగాలను పడేశాడు. చిక్కుముడిగా మారిన ఈ వ్యవహారంపై పోలీసులు ఫోకస్ చేశారు. చివరకు తీగలాగితే డొంకంతా కదిలింది. నిందితుడు ఎవరో తెలుసా? మృతురాలికి అక్క కొడుకు. ఫ్యామిలీ సమస్యల కారణంగా ఆ విధంగా చేసినట్టు తెలుస్తోంది.
విజయవాడలోని భవానీపురం ఊర్మిళానగర్‌లో ఉంటోంది 68 ఏళ్ల విజయలక్ష్మి. కొడుకుతో కలిసి వివాహ సంబంధాలు చూస్తుంటారు. ఆమె భర్త పిచ్చయ్య ఆరేళ్ల కిందట చనిపోయాడు. ఆమె అక్క కొడుకు నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం ఉపాధి నిమిత్తం దశాబ్దం కిందట విజయవాడ వచ్చాడు. అతడికి ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.
ముక్కలుగా చేసి పగ తీర్చుకున్న నిందితుడు
తొలుత టైలర్‌గా పని చేశాడు. కొంతకాలం షాపుల్లో గుమస్తాగా పని చేశాడు. ఏం జరిగిందో తెలీదుగానీ సుబ్రహ్మణ్యం దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ క్రమంలో అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. సుబ్రహ్యణ్యం భార్య ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం కంభంపాడు గ్రామానికి చెందిన మహిళ.
తన ఫ్యామిలీని పిన్ని విడదీసిందని అనుమానించాడు సుబ్రహ్మణ్యం. చెప్పుడు మాటల కారణంగా భార్య వెళ్లిందని ఓ అంచనాకు వచ్చాడు. అంతేకాదు మూడేళ్ల కిందట తనపై కొందరు వ్యక్తులు దాడికి చేయడానికి పిన్ని కారణమని భావించాడు. అప్పటి నుంచి ఆమెపై ద్వేషం, కసి పెంచుకున్నాడు.
సీన్ కట్ చేస్తే.. పిన్నికి ఎవరూ లేకపోవడం గమనించారు. ఆమెపై పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని నిర్ణయానికి వచ్చేశాడు. కొడుకుతో విజయలక్ష్మిని అత్యంత కిరాతంగా హత మార్చాడు. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత ఆయా భాగాలను కాలువలు, ఖాళీ ప్రదేశాల్లో పడేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు.