Karan Johar: ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనిక హీరో, హీరోయిన్ , నిర్మాతలను చూశాము. ఇప్పుడు అత్యంత ధనిక దర్శకుడుగా కరుణ్ జోహార్ (Karan Johar) రికార్డు సృష్టించారు. బాలీవుడ్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకున్నారు కరణ్ జోహార్. ముఖ్యంగా కథ ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈయన.. ఎక్కువగా స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడంలో ముందుంటారు అనడంలో సందేహం లేదు. ఇప్పటికే చాలామంది బాలీవుడ్ స్టార్ కిడ్స్ అందరూ కూడా ఈయన బ్యానర్ లోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు అరుదైన జాబితాలో స్థానం సంపాదించుకున్నారు కరణ్ జోహార్.” హురూన్ 2025″ జాబితా ప్రకారం.. భారతదేశంలోని కొంతమంది ధనవంతుల జాబితాను రూపొందించగా.. అందులో టాప్ 5 లో కరణ్ జోహార్ స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈయన నికర ఆస్తుల విలువ సుమారుగా రూ.1880 కోట్లు. కరణ్ బాలీవుడ్లో టాప్ – 5 ధనవంతులలో ఒకరిగా చోటు దక్కించుకోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఈ టాప్ ఫైవ్ లో కరణ్ జోహార్ నాలుగవ స్థానంలో ఉండగా.. షారుక్ ఖాన్.. 12,490 కోట్ల నికర ఆస్తులతో మొదటి స్థానంలో నిలిచారు. జుహీ చావ్లా – 7,790 కోట్లు, హృతిక్ రోషన్ – 2,160 కోట్లు, కరణ్ జోహార్ – 1880 కోట్లు, అమితాబ్ బచ్చన్ – 1,630 కోట్లతో టాప్ ఫైవ్ లో నిలిచారు.
ALSO READ:Tollywood: రొమాన్స్ వదిలేస్తున్న హీరోయిన్లు… కానీ అవి వర్కౌట్ అయ్యేనా?
కరణ్ జోహార్ ఆస్తులు వివరాల విషయానికి వస్తే.. డైరెక్టర్ గా ఒక్కో చిత్రానికి రూ.3 నుండి రూ.5కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈయన.. సంవత్సరానికి వివిధ మార్గాలలో రూ.100 కోట్లకు పైగా ఆదాయాన్ని అందుకుంటున్నట్లు సమాచారం. లెన్స్ కార్ట్ , వివో ఇండియా, నార్ సూప్స్ వంటి హై ఎండ్ బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అలాగే ఏఐ నేతృత్వంలోని యాడ్ మార్కెటింగ్ ప్లాట్ ఫామ్ అయినా కో ఫ్లూయెన్స్ లో పెట్టుబడిదారుడుగా పేరు దక్కించుకున్నారు. అలాగే ధర్మా ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఈ చిత్రం ద్వారా భారీ సక్సెస్ లు అందుకుంటున్నారు. వాణిజ్య ప్రకటనలను రూపొందించడానికి ధర్మా 2.0, సినిమా, టెలివిజన్ కంటెంట్ ను ఆన్లైన్లో పంపిణీ చేయడానికి ధర్మాటిక్ ఎంటర్టైన్మెంట్ ని కూడా స్థాపించారు. అలాగే తన ఆభరణాల శ్రేణి త్యానీ జువెలరీని ను 2021 లో ప్రారంభించారు. 2022లో దక్షిణ ముంబైలో ఆధునిక యూరోపియన్ రెస్టారెంట్ అయినా న్యూమాను కూడా స్థాపించారు.
ముంబైలోని కార్టర్ రోడ్ లో సముద్రానికి ఎదురుగా రూ.32 కోట్ల విలువైన విలాసవంతమైన డూప్లెక్స్ హౌస్ ఉంది. అలాగే రూ.20 కోట్ల విలువైన మలబార్ హిల్స్ భవనం కూడా ఈయన సొంతం. నగర శివారు ప్రాంతాలలో 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో పెద్ద ఆఫీసు, ఢిల్లీలోని మెహ్రౌలీలో కూడా ఆస్తి ఉంది. ఈయన లగ్జరీ కార్ల విషయానికొస్తే.. బీఎండబ్ల్యూ, ఆడి , జాగ్వర్ వంటి మోడల్స్ ఉన్నాయి.