Vijay Devarakonda- Rashmika : టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఆ మధ్య వీళ్లిద్దరూ కలిసి వెళ్లిన ట్రిప్పులకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఫాన్స్ దాదాపు కన్ఫర్మ్ చేసుకున్నారు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అటు రష్మిక ఇటు విజయ్ దేవరకొండ పెడుతున్న పోస్టులను చూస్తుంటే ఆ వార్త నిజమేనని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ రింగ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ రింగుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు వాళ్ళ దాంపత్య జీవితాన్ని జీవితాంతం ఉండాలని ఎంతో అన్యోన్యంగా కొనసాగిస్తుంటే.. కొంతమంది మాత్రం మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఈ మధ్య విడాకుల తంతు ఎక్కువగా వినిపిస్తున్నా.. సరే సెలబ్రిటీల జంటలు ప్రేమలో పడుతూ పెళ్లి వరకు వెళ్తున్నారు.
తాజాగా మరో క్రెజీ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీరిద్దరూ సైలెంట్ గా ఇరు కుటుంబాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నట్లు తెలుస్తుంది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కి ఎంగేజ్మెంట్ రింగ్ చూపించినట్లు ఫోటోలు బయటకు వచ్చాయి.
అయితే ఈ వార్తలు నిజమేనని ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లోనూ.. అటు సోషల్ మీడియాలను ఇదే హాట్ టాపిక్ గా మారింది.. ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియదు కానీ త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి పీటలేకపోతున్నారంటూ మరో వార్త నెట్టింట ఒక ఊపు ఊపేస్తుంది.. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఆ న్యూస్ని కూడా త్వరలోనే షేర్ చేసుకుంటారేమో చూడాలి..
Also Read : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..
కన్నడి ముద్దుగుమ్మ రష్మిక మందన్న ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత గీత గోవిందం అనే సినిమాలో విజయ్ దేవరకొండతో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత డియర్ కామ్రేడ్ అనే సినీమాలో కూడా విజయ్ దేవరకొండ, రష్మికలు జంటగా నటించారు. అప్పటి నుంచీ వీరి బంధం మరింత బలపడిందని సీనీ వర్గాల టాక్… ఆ తర్వాత ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్తూ వస్తున్నారు. వీరికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన సరే మేమిద్దరం సినిమాలతో బిజీగా ఉన్నాము ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ పలు సందర్భాల్లో బయటపెట్టారు.. ఇరు కుటుంబాల అంగీకారంతో నిరాడంబరంగా ఇరువురి వివాహ నిశ్చితార్థం జరిగిందని చెబుతున్నారు.. ఫిబ్రవరిలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటవ్వబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. త్వరలోనే డేట్ ని కూడా ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
విజయ్ దేవరకొండ చేతికి రింగ్..!
ఇటీవలే హీరోయిన్ రష్మికతో విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ జరిగిందంటూ వార్తలు
ఈ క్రమంలో నిన్న తన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తి సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న విజయ్
ఇందుకు సంబంధించిన ఫోటోలలో విజయ్ చేతికి కనిపించిన రింగ్
అదే ఎంగేజ్మెంట్ రింగ్… https://t.co/2883LKytsy pic.twitter.com/PGR0gile25
— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2025