వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ ( India Women vs Pakistan Women ) మ్యాచ్ జరగగా మీడియం ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్ అదిరిపోయే ఆట తీరు కనబరిచారు. 22 సంవత్సరాల టీమ్ ఇండియా మీడియం ఫాస్ట్ బౌలర్ క్రాంతి గౌడ్, ఏకంగా మూడు వికెట్లు పడగొట్టి పాకిస్తాన్ నడ్డి విరిచారు. ఓపెనర్ సదాఫ్ శమాష్, అలియా రియాజ్ అలాగే నటాలియా వికెట్లను పడగొట్టి తన సత్తా చాటారు క్రాంతి గౌడ్.
పాకిస్తాన్ పై నిన్న జరిగిన మ్యాచ్ లో మొత్తం 10 ఓవర్లు వేసింది క్రాంతి గౌడ్. ఇందులో ఏకంగా మూడు ఓవర్లు మేడిన్ చేసింది. కేవలం 20 పరుగులు ఇచ్చిన క్రాంతి గౌడ్ మూడు వికెట్లు పడగొట్టింది. రెండు ఎకనామితో టీమిండియా మహిళల జట్టులో కూడా లేడీ బుమ్రా ఉన్నట్లు మరోసారి తేల్చింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన క్రాంతి గౌడ్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. అయితే ఇంత అద్భుతంగా ఆడుతున్న క్రాంతి గౌడ్ ను కొంతమంది దారుణంగా అవమానించారు. అసలు ఆమె లేడీ కాదని, మగాడిలా ఉందని ఎద్దేవా చేశారు.
వాస్తవానికి ఆమె హెయిర్ స్టైల్ మగాడిలా ఉంటుంది. ఆటపై దృష్టి పెట్టేందుకు మగాడిలా హెయిర్ కటింగ్ చేయించుకుందట. కానీ ఇది అర్థం చేసుకోని కొంతమంది ఆమెను అవమానించారు. క్రాంతి గౌడ్ లేడీ కాదు మగాడు అంటూ పోస్టులు పెట్టారు. కానీ నిన్న పాకిస్తాన్ పై వీరుడిలా పోరాడారు క్రాంతి గౌడ్. దీంతో ఆమెను ట్రోలింగ్ చేసిన వారే ఇప్పుడు మెచ్చుకుంటూ పోస్టులు పెడుతున్నారు. టీమిండియా లేడి బుమ్రా అంటూ పొగుడుతున్నారు.