HHVM Collections : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహరవీరమల్లు.. డిప్యూటీ సీఏం అయ్యాక రాబోతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. జూలై 24 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఐదేళ్లుగా సెట్స్ మీదనే ఉన్న ఈ మూవీ ఇన్నాళ్లకు ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో తొలి పాన్ ఇండియా మూవీగా భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే బుధవారం రాత్రే ప్రీమియర్ షోలు ప్రదర్శించగా, టిక్కెట్ రేట్లు పెరిగినప్పటికీ మంచి స్పందన లభించింది. ఆ తర్వాత మిక్సీ్డ్ టాక్ రావడంతో రోజు రోజుకు కలెక్షన్స్ భారీగా పడిపోతున్నాయి. నిన్న దారుణంగా కలెక్షన్స్ పడిపోయాయని తెలుస్తుంది. ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం..
‘హరిహర వీరమల్లు’ కలెక్షన్స్..
ఈ మూవీకి ప్రీమియర్స్ ద్వారా 12.75 కోట్ల రూపాయలు, ఫస్ట్ డే నాడు 34.75 కోట్ల రూపాయలు, రెండో రోజున రూ.8.79 కోట్ల నెట్, 3వ రోజున రూ.9.15 కోట్లు, 4వ రోజున 10.6 కోట్ల రూపాయలు, 5వ రోజున రూ.2.1, 6వ రోజు కోటి వరకు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా 75 కోట్లకు పైగా మాత్రమే ఇప్పటివరకు రాబట్టింది. ఈ లెక్కన చూస్తే భారీగా నష్టాన్ని మిగిల్చిందని తెలుస్తుంది. ఈ వీకెండ్ అయిన కలెక్షన్స్ పెరుగుతాయేమో అని పవన్ అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు. 100 కోట్లు వసూల్ చేస్తుందేమో చూద్దాం..
Also Read: ‘మహావతార్ నరసింహ’ తాండవం.. ఐదు రోజులకు ఎన్ని కోట్లంటే..?
మూవీ బడ్జెట్ & టార్గెట్..?
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు.. ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్ తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ఏం ఏం కీరవాణి సంగీతాన్ని అందించారు. జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్క్రీన్లలో రిలీజైంది.. వరల్డ్ టాప్ టెక్నీషియన్లు కూడా పనిచేయడం విశేషం. రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రమోషన్స్ ఖర్చులన్నీ కలుపుకొని ఈ చిత్రానికి రూ.250 కోట్లు వ్యయంతో నిర్మించారు. పవన్ కళ్యాణ్ నుంచి మొదటి పాన్ ఇండియా మూవీ రిలీజ్ కాబోతుండటంతో సినిమాకు భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం, ఆంధ్రాలో కలిపి 103 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఇండియాలో రూ.117 కోట్ల బిజినెస్, ఓవర్సీస్ లో మరో 10 కోట్ల బిజినెస్ జరిగింది. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి రూ.127 కోట్ల బిజినెస్ జరిగిందని సమాచారం.. 52 కోట్లు ఫస్ట్ డే వసూల్ అయ్యాయి.. మొత్తంగా 80 కోట్లు కూడా వసూల్ చెయ్యలేదు. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో అందరి దృష్టి ఓజీ పై పడింది. సెప్టెంబర్ లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది..