AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసు వ్యవహారంలో వైసీపీ కీలక నేతలకు నిద్ర పట్టడం లేదు. కసిరెడ్డి గ్యాంగ్‌లో కలెక్షన్ కింగ్‌గా పేరు పొందిన వరుణ్‌ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అరెస్టు చేశారు. వరుణ్‌ని విచారిస్తే కీలక విషయాలు బయటకురావడం ఖాయమని భావిస్తున్నారు అధికారులు.
మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. ఆయనతో కలిసి ఇప్పటివరకు ఈ కేసులో అరెస్టయివారి సంఖ్య 13కి చేరింది. ఫామ్‌హౌస్‌లో నగదు పట్టుబడగానే శంషాబాద్ ఎయిర్‌పోర్టు విదేశాలకు పారిపోయేందుకు వరుణ్ ప్రయత్నించినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో ఆయనను ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకుంది. హైదరాబాద్ నుంచి నేరుగా విజయవాడలో సిట్ కార్యాలయానికి తరలించారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత వరుణ్‌ని న్యాయస్థానంలో అధికారులు హాజరుపరిచే అవకాశముంది. లిక్కర్ కేసులో ఏ-40 నిందితుడిగా వరుణ్ ఉన్నాడు.
కసిరెడ్డి ఇచ్చిన సమాచారంతో బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు సిట్ అధికారులు. రాత్రి 10 గంటల సమయంలో నాలుగైదు వాహనాల్లో కాచారంలోని సులోచన ఫామ్‌హౌస్‌కి వచ్చారు. సోదాలు చేసే క్రమంలో అక్కడి నుంచి వరుణ్ ఎస్కేప్ అయ్యాడు. అప్పటికే ఎయిర్‌పోర్టులో సిట్ టీమ్ రెడీగా ఉంది.
ALSO READ: ఏపీ లిక్కర్ కేసు.. ఫామ్ హౌస్‌ని రౌండప్ చేసిన సిట్
వరుణ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1 కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీమ్‌లో వరుణ్ కీలక అనుచరుడు. హైదరాబాద్ సిటీలో వేర్వేరు ప్రాంతాల్లో ముడుపులు దాయడం వెనుక కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అతడ్ని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు సిట్ అధికారులు.
లిక్కర్ కేసు నమోదైన వెంటనే వరుణ్‌ని దేశం దాటించేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. వరుణ్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇప్పటికే జారీ అయ్యింది. వరుణ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లో ముడుపులు దాచిన డెన్‌పై సోదాలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని అరెస్టు ఉంటాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ లిక్కర్ స్కాంలో మరొకరు అరెస్ట్
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో A40 వరుణ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్
విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వరుణ్‌ను అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు https://t.co/0yyuJRZTwV
— BIG TV Breaking News (@bigtvtelugu) July 30, 2025