Mahavatar Narasimha Collections : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కేవలం ఫ్యామిలీ కథా చిత్రాలు మాత్రమే కనిపించేవి.. ఆ తర్వాత రొమాంటిక్ సినిమాలు ఎక్కువగా యూత్ ని ఆకట్టుకునేవి. ఈ మధ్య మాత్రం డైరెక్టర్లు పురాణాల మీద సినిమాలు చేస్తున్నారు. పురాణాల్లోని కొన్ని కథలను ఎంపిక చేసుకొని వాటి మీద సినిమాలు తీసి భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. గత ఏడాది రిలీజ్ అయిన ‘కల్కి’ సినిమాను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలాగే ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న సినిమా మహావతార్ నరసింహ.. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఐదు రోజులకు గాను ఎన్ని కోట్లను వసూలు చేసిందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘మహావతార్ నరసింహ ‘ కలెక్షన్స్..
పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్లలో ఉండగానే మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ మూవీనే ‘మహావతార్ నరసింహ ‘.. , నరసింహ స్వామి జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమా మైథాలజికల్ గా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. దాంతో మొదటి రోజు కోటి 70 లక్షల కలెక్షన్స్ ను మాత్రమే రాబట్టింది.. మొత్తం నాలుగు రోజులకు గాను దాదాపుగా 23 కోట్లు వసూల్ చేసింది. మొత్తంగా బాగానే గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టడం విశేషం…తెలుగులో అల్లు అరవింద్ కొనుగోలు చేసి ఆయనే ఓన్ గా రిలీజ్ చేశాడు. ఆయన పంట పండింది భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతుంది. ఐదో రోజు కూడా భారీగానే వసూల్ చేసింది. మంగళవారం 7.5 కోట్లు వసూల్ చేసింది. టోటల్ గా 30 కోట్లు వసూల్ చేసింది..
Also Read :ఆ హీరో నన్ను దారుణంగా కొట్టాడు.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజాలు..
ఈ మూవీ బడ్జెట్..
మహావతార్ నరసింహ జులై 25న ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా రిలీజైన ఈ చిత్రం వెండితెరపై ప్రకంపనలు సృష్టిస్తోంది. పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను అందుకుంది. నటీనటులు లేకుండా కేవలం యానిమేషన్‌తోనే తెరకెక్కిచడం వల్ల పాత్రలతోనూ, ఆ భావోద్వేగాలతోనూ ప్రేక్షకులు మరింత ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.. మొత్తానికి మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 4 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ మూవీ 30 కోట్లు వసూల్ చెయ్యడం మామూలు విషయం కాదు. ఇలాంటి సినిమాలకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని చూసేందుకు జనాలు చెప్పులను బయట వదిలేసి వెళుతున్నట్లు ఓ వీడియో క్లిప్పు బయటకు వచ్చింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీకెండ్ లోపల 50 కోట్లు దాటే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాల్లో టాక్.. వచ్చే నెల లోపు 100 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు..