HHVM Movie : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు.. గత కొన్ని ఏళ్లుగా ఈ సినిమా కోసం ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మొత్తానికి భారీ అంచనాలతో నిన్న థియేటర్లోకి వచ్చేసింది. పవన్ కళ్యాణ్ సినిమాకు మొదటి నుంచి క్రేజ్ ఎక్కువే అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ హవా కొనసాగుతుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్స్ కూడా భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజిత పొన్నాడ నటించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఈ సినిమాలో ఏ సినిమాలో కనిపించింది? లేదా ఏదైనా సాంగ్ లో కనిపించిందా అన్న విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ తో స్టెప్పులేసిన పూజిత..
పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన మూవీ హరిహర వీరమల్లు.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తుంది.. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ రావడంతో నిన్న సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్రయూనిట్.. ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలెట్గా నిలిచింది. ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పూజిత పొన్నాడా ఇందులో నటించిందని ఓ వార్త షికారు చేస్తుంది. నిజానికి ఈమె సినిమాలో లేదు. కేవలం కొల్లగొట్టినాదిరో అనే సాంగ్ లో అనసూయతో కలిసి అద్భుతమైన స్టెప్పులు వేసింది. ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు.
Also Read:తెలుగు నిర్మాతలకు షాక్.. మళ్లీ రేటు పెంచిన జాన్వీ.. ఎంతంటే.?
పవన్ కళ్యాణ్ హిట్ కొట్టాడా..?
దాదాపుగా కొన్నేళ్ల నుంచి పవన్ కళ్యాణ్ నుంచి సినిమాలు రాలేదు. ఏపీ ఎన్నికల తర్వాత మొదటిసారి పవన్ కళ్యాణ్ నటించిన సినిమా హరిహర వీరమల్లు. రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్న ఈ మూవీ మొత్తానికి నిన్న థియేటర్లలోకి వచ్చేసింది.. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయిన కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ప్రీమియర్ షోలు పడడంతో సినిమాకు కలెక్షన్లు భారీగా పెరిగినట్లు సమాచారం. మరి మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లను రాబాట్టిందో చూడాలి.. ఇక పవన్ కళ్యాణ్ నటించిన మరో సినిమా ఓజీ.. ఈ మూవీ కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.. సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీని తర్వాత హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటిస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్ర. త్వరలోనే విడుదల డేట్ ను అనౌన్స్ చెయ్యనున్నారని ఇండస్ట్రీలో టాక్..