ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలంటే ఆధార్ కేంద్రానికి తప్పకుండా వెళ్లాలి. అక్కడ రద్దీని బట్టి గంట నుంచి రెండు గంటల సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువ సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. ఇకపై ఈ ఇబ్బందులను తప్పించేందుకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త మొబైల్ అప్లికేషన్ ను అందుబాటులోకి తీసురాబోతోంది. e-ఆధార్ పేరుతో ఈ యాప్ ను పరిచయం చేయబోతోంది. దీని ద్వారా ప్రజలు పుట్టిన రోజు, చిరునామా, ఫోన్ నంబర్ లాంటి కీలక సమాచారాన్ని.. జస్ట్ స్మార్ట్ ఫోన్ నుంచే నేరుగా అప్ డేట్ చేసుకునే అవకాశం కల్పించబోతోంది. తక్కువ సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతోంది.
ఆధార్ అప్ డేట్స్ కు సంబంధించి ఈ యాప్ ఉపయోగపడనుంది. దీని ద్వారా ఆధారా సెంటర్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎవరికి వారు స్వయంగా, సులభంగా, తమ ఆధార్ ను అప్ డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ ఈ యాప్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు.
⦿ నివాస చిరునామాను మార్చుకోవచ్చు.
⦿ ఆధార్ తో లింక్ చేసిన ఫోన్ నెంబర్ ను అప్ డేట్ చేసుకోవచ్చు.
ఈ యాప్ కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కాదు.. వినియోగదారులను భద్రతను కాపాడేందుకు AI, ఫేస్ ID టెక్నాలజీని ఉపయోగిస్తుంది. అయితే, వేలిముద్రలు, ఐరిస్-స్కాన్ కోసం ఆధార్ కేంద్రానికి తప్పకుండా వెళ్లాల్సిందే. వచ్చే నెలలోనే ఆధార్ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
Read Also: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!
⦿ యాప్ 2025 చివరి నాటికి వస్తుందని భావిస్తున్నారు. కచ్చితమైన రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.
⦿ వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటి బయోమెట్రిక్ అప్ డేట్ లకు ఇప్పటికీ ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.
⦿ ఈ యాప్ ప్రారంభించిన తర్వాత, పాస్ పోర్ట్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్ తో పాటు ప్రభుత్వం ధృవీకరించిన డాక్యుమెంట్స్ తో ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు.
⦿ ఆధార్ యాప్ తో ఆధార్ అప్ డేట్ చేసుకోవడానికి కచ్చితంగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. లేకపోతే వెంటనే చేసుకోవడం ఉత్తమం. అదే సమయంలో అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్ మార్చుకునేందుకు అవసరమైన డాక్యుమెంట్స్ రెడీగా ఉంచుకోవాలి.
⦿ UIDAI యాప్ ఎప్పుడు వస్తుందనే కచ్చితంగా తెలియదు. ఒకవేళ అత్యవసరంగా ఆధార్ అప్ డేట్ చేసుకోవాలంటే ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లడం మంచిది.
Read Also: కోడలికి షాకిచ్చిన హైకోర్ట్.. ఆమె జీతంలో రూ.20 వేలు మావయ్యకు చెల్లించాలని తీర్పు, ఎందుకంటే?