Mass Jathara:ప్రముఖ రచయిత భాను భోగవరపు (Bhanu Bhogavarapu) తొలిసారి దర్శకుడిగా మారుతూ.. తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’. రవితేజ (Raviteja) హీరోగా, శ్రీ లీల (SreeLeela) హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎప్పుడో వినాయక చవితి సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడుతూ అక్టోబర్ 31కి వాయిదా వేశారు. కనీసం ఆరోజైనా విడుదలవుతుంది అనుకోగా.. ఆరోజు బాహుబలి ది ఎపిక్ రిలీజ్ ఉండడంతో వాయిదా వేసుకోవడం జరిగింది. అలా నవంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి అక్టోబర్ 31 నైట్ ప్రీమియర్ షోలు పడగా.. నవంబర్ 1న షోలు ప్రారంభం అయ్యాయి.
ఇకపోతే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో రాబట్టింది..? మొత్తం రెండు రోజులకు గాను ఎంత కలెక్షన్స్ వసూలు అయ్యాయి..? అసలు రవితేజ ఈ మాస్ జాతర సినిమాతో హిట్టు కొట్టాడా? అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. తాజాగా మాస్ జాతర మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.5.4 కోట్ల కలెక్షన్స్ మాత్రమే వసూలు చేసింది. కానీ రెండవ రోజు ఈ కలెక్షన్స్ పెరుగుతాయి అనుకోగా.. ఇప్పుడు రెండు రోజులకు గాను కేవలం రూ.8.5 కోట్లు లభించాయి. మొత్తానికైతే రెండు రోజులగాను కేవలం 9 కోట్లు కూడా కలెక్షన్స్ దాటకపోవడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఒక రీ రిలీజ్ చిత్రం ముందు మాస్ జాతర నిలవలేకపోయింది అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సక్సెస్ కోసం ఎదురుచూసిన రవితేజకు మళ్ళీ ఫ్లాప్ ఎదురవడంతో అభిమానులు కూడా తట్టుకోలేకపోతున్నారు.
also read:Bigg Boss 9 Promo: నామినేషన్ వార్.. బాండింగ్ పై స్పందించిన రీతూ చౌదరి..
మాస్ జాతర సినిమా స్టోరీ విషయానికి వస్తే.. లక్ష్మణ్ భేరి (రవితేజ) ఒక రైల్వే పోలీస్. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఇతనికి అన్ని తానై పెంచుతాడు తన తాత (రాజేంద్రప్రసాద్). అతని కోరిక మేరకే పోలీస్ కావాలనుకున్న లక్ష్మణ్ కేవలం రైల్వే పోలీస్ దగ్గర ఆగిపోతాడు. అందువల్ల తన ఊరిలో జరిగే అన్యాయాలను అడ్డుకోలేకపోతున్నాను అనే బాధపడుతూ ఉంటాడు. అలాంటి లక్ష్మణ్ ఒక ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అయితే ఆ ఊర్లో జనాలతో గంజాయి పండించాలని ఒత్తిడి చేస్తూ ఉంటాడు శివుడు (నవీన్ చంద్ర). ఒకరోజు అతడు 20 టన్నుల గంజాయిని కోల్కతా తీసుకెళ్లాల్సి వస్తుంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో గూడ్స్ ట్రైన్ ద్వారా ఆ సరుకును ఊరు దాటించాలి అనుకుంటాడు. కానీ అది లక్ష్మణ్ కి తెలిసి.. అతడి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. అక్కడ మొదలైన వీరి మధ్య గొడవ ఏ టర్న్ తీసుకుంది? మధ్యలో తులసి(శ్రీ లీల) పాత్ర ఏంటి ? అసలు హీరో తాత అతడికి పెళ్లి కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఇలా పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.