Dragon: ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ – నీల్ సినిమా కూడా ఒకటి. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ విజయం తరువాత ఎన్టీఆర్ దేవరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేసి దేవరతో మంచి హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత బాలీవుడ్ లో పాగా వేయాలని గట్టి ప్రయత్నాలు చేశాడు. అనుకున్నట్లుగానే YRF యూనివర్స్ లో అడుగుపెట్టాడు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోని వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ పరాజయాన్ని చవిచూశాడు. కాలర్ ఎగరేసి చెప్తున్నా.. ఫ్యాన్స్ ను తల దించుకోనివ్వను అని చెప్పి.. పాపం థియేటర్ నుంచి ఫ్యాన్స్ ఊసురుమంటూ వచ్చేలా చేశాడు.
ఇక వార్ 2 పక్కన పెడితే.. ఈసారి మాత్రం ఎన్టీఆర్.. ఫ్యాన్స్ ను తల ఎత్తుకొనేలా చేయడానికి సిద్దమయ్యాడు. అందులో భాగంగానే ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ బాగా కష్టపడుతున్నాడు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ మంచి హైప్ ను క్రియేట్ చేసింది.
ఒక సినిమా తెరకెక్కుతుంది అంటే అందులో చాలామంది మధ్య విభేదాలు వస్తాయి అన్నది చాలా సాధారణమైన విషయం. డ్రాగన్ లో కూడా హీరోకు, డైరెక్టర్ కు మధ్య పొసగలేదని టాక్ నడిచింది. ఇప్పటివరకు తీసిన రెండు షెడ్యూల్స్ అవుట్ పుట్ ఎన్టీఆర్ కి నచ్చలేదని. దీంతో నీల్ తో గొడవపడి బయటకు వచ్చేసాడని రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజులు డ్రాగన్ షూట్ కు బ్రేక్ పడిందని కూడా మాట్లాడుకున్నారు.
ఇక ఇప్పుడు ఇంకో సరికొత్త రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ – నీల్ మధ్య మైత్రీ మూవీ మేకర్స్ సంధి కుదర్చినట్లు సమాచారం. దీంతో డ్రాగన్ మరోసారి పట్టాలెక్కనుంది. నవంబర్ చివరి వారంలో యూరప్ లో డ్రాగన్ షూట్ మళ్లీ మొదలుకానుంది. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే.. డ్రాగన్ రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనీ నీల్ – ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
డ్రాగన్ సినిమా మొత్తం 3 గంటల 40 నిమిషాలు వస్తుందని, అంత నిడివితో సినిమాను రిలీజ్ చేయలేరు కాబట్టి రెండు భాగాలుగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేశారట. అది కూడా రెండు భాగాల షూటింగ్ ను ఒకేసారి ఫినిష్ చేసి నెలల గ్యాప్ లో రెండు పార్ట్స్ ను రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటివరకు గొడవపడి.. మేకర్స్ సంధి కుదిర్చితే కానీ, ఒక్కటి అవ్వని ఎన్టీఆర్ – నీల్.. ఇప్పుడు ఈ విషయంలో ఒక్కటిగా డెసిషన్ తీసుకున్నారు అంటే నమ్మశక్యం కావడం లేదే అని పలువురు పెదవి విరుస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.