BigTV English

Janvikapoor : తెలుగు నిర్మాతలకు షాక్.. మళ్లీ రేటు పెంచిన జాన్వీ.. ఎంతంటే.?

Janvikapoor : తెలుగు నిర్మాతలకు షాక్.. మళ్లీ రేటు పెంచిన జాన్వీ.. ఎంతంటే.?

Janvikapoor : బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన భారీ యాక్షన్ మూవీ దేవర సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమె పాత్ర తక్కువ సమయం ఉన్నా కూడా తన అందం, నటనతో బాగానే ఆకట్టుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నటనకు ఫుల్ మార్కులు పడ్డాయి.. ఆ సినిమా రిలీజ్ అవ్వక ముందే వరుసగా సినిమాలను లైన్లో పెట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా గడుపుతుంది. ప్రస్తుతం తెలుగులో ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టడంతో జాన్వీ పాప రేటు పెంచిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. జాన్వీ ఒక్క సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఒకసారి తెలుసుకుందాం..


రేటు పెంచేసిన జాన్వీ..

బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఒక్కో మూవీతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వస్తుంది.. అటు బాలీవుడ్ లో వరుస సినిమాలను లైన్లో పెడుతూనే… టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ ని కొట్టేస్తుంది. దేవర సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి.. గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ డెబ్యూ దేవరకు రూ.5 కోట్లు రెమ్యునరేషన్ అందుకున్న జాన్వీ.. ఇప్పుడు పెద్ది మూవీకి గాను రూ.6 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగులో రెండో చిత్రానికే కోటి రూపాయలు పెంచేసిందని సమాచారం. అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీకి ఏడు కోట్ల వరకు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా జాన్వి పాప రేటు పెంచడంపై టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చలు మొదలయ్యాయి.


Also Read:సందీప్ మాస్టర్, జ్యోతిలు విడిపోయారా? ఆ పిచ్చి వల్లే దూరం..

జాన్వీ కపూర్ సినిమాలు.. 

స్వర్గీయ నటి శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చింది జాన్వికపూర్.. బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే యూత్ క్రష్ గా మారిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసింది. తెలుగులో ఎంట్రీ తోనే ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ ని కొట్టేసింది.. దేవర సినిమాలో ఈమె నటన తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ మూవీ సీక్వెల్ లో కూడా నటించనుంది. ఆమె రోల్ కు మంచి ప్రాధాన్యం ఉన్నట్లు ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం మరో స్టార్ హీరో రామ్ చరణ్ పెద్ది సినిమాలో యాక్ట్ చేస్తోంది జాన్వీ. స్పోర్ట్స్ కమ్ రూరల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బుచ్చిబాబు దర్శకత్వం లో మూవీ రాబోతుంది. అల్లు అర్జున్ సరసన ఓ సినిమాలో నటించబోతుంది. వీటితో పాటు మరో రెండు సినిమాలకు సైన్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వాటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×