SSMB 29:దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) , రామ్ చరణ్(Ram Charan) ఎన్టీఆర్ (NTR) లతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేసి ఏకంగా ఆస్కార్ లెవెల్ లో గుర్తింపు సొంతం చేసుకున్న ఈయనం. ఈ సినిమా తర్వాత అంతే ప్రెస్టేజియస్ గా మహేష్ బాబు (Maheshbabu) తో ‘ఎస్ఎస్ఎంబి 29’ అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమా 2027లో విడుదల కానుంది. ఇందులోని సన్నివేశాలు సహజంగా ఉండడానికి దేశ విదేశాలను చుట్టేస్తూ.. ఆ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుతూ చాలా పగడ్బందీగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా అనౌన్స్మెంట్ తర్వాత ఈ సినిమా నుంచి అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు మెడలో ఉన్న లాకెట్ ను మాత్రమే రిలీజ్ చేశారు రాజమౌళి. అంతేకాదు నవంబర్లో అతిపెద్ద అప్డేట్ ఇస్తానని కూడా ప్రకటించారు. నవంబర్ 15వ తేదీన టైటిల్ రిలీజ్ చేస్తారని , ఈ సినిమాకు వారణాసి అని టైటిల్ పెడతారు అని అభిమానులే కాదు అటు సినీ ఇండస్ట్రీ మొత్తం ఇదే టైటిల్ ను ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడు సడన్ గా ప్రముఖ డైరెక్టర్ సీహెచ్ సుబ్బారెడ్డి (CH Subba Reddy) ‘వారణాసి’ టైటిల్ ను అఫీషియల్ గా ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది అంటూ డైలమాలో పడిపోయారు.
ఆది సాయికుమార్, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్లో వచ్చిన రఫ్ (Ruff) అనే సినిమాకు దర్శకత్వం వహించిన సిహెచ్ సుబ్బారెడ్డి చాలాకాలం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాను ప్రకటిస్తూ వారణాసి అంటూ టైటిల్ రిలీజ్ చేశారు. రామబ్రహ్మ హనుమ ప్రొడక్షన్స్ బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం వారణాసి టైటిల్ ను ఫిక్స్ చేస్తారని అందరూ అనుకున్న సమయంలో సడన్గా సిహెచ్ సుబ్బారెడ్డి అధికారికంగా ఈ టైటిల్ ను అలాగే ఒక పోస్టర్ను రిలీజ్ చేస్తూ ప్రకటించడం తో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
also read:Prabhas: ప్రభాస్ ట్యాగ్.. బాలీవుడ్ స్టార్స్ కి మింగుడు పడడం లేదా?
అంతేకాదు సిహెచ్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా టైటిల్ ను ముందే రిజిస్టర్ చేయించామని ఆయన స్పష్టం చేశారు. మరి సిహెచ్ సుబ్బారెడ్డి టైటిల్ రిలీజ్ చేశారు కాబట్టి ఎస్ ఎస్ ఎం బి 29 కి కూడా ఇదే టైటిల్ ప్రకటిస్తారా లేక రాజమౌళి మరో టైటిల్ ఏదైనా అనౌన్స్ చేస్తారా? అసలు రాజమౌళి ఈ విషయంపై స్పందిస్తారా? అనే విషయం తెలియాల్సి ఉంది. మొత్తానికి మహేష్ బాబు మూవీ కోసం అనౌన్స్ చేసిన ఈ టైటిల్ ని ఇప్పుడు మరో డైరెక్టర్ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
#Varanasi టైటిల్ పై బిగ్ ట్విస్ట్
#SubbaReddyCH డైరెక్షన్ లో మూవీ టైటిల్ పోస్టర్ అవుట్..
నిజానికి ఈ టైటిల్ #SSMB29 కి పరిశీలనలో ఉందనే టాక్ ఉంది. pic.twitter.com/Xal6XQRkeW— BIG TV Cinema (@BigtvCinema) November 3, 2025