E-Paper
Advertisement

Bahubali The Epic Collections : బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి’ కలెక్షన్ల సునామీ.. జక్కన్న ఖాతాలో మరో రికార్డ్..

Bahubali The Epic Collections : బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి’ కలెక్షన్ల సునామీ.. జక్కన్న ఖాతాలో మరో రికార్డ్..

Bahubali The Epic Collections : కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డుని నమోదు చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో దర్శకధీరుడు రాజమౌళి తెర్కెక్కించిన బాహుబలి ఒకటి. ఈ సినిమాతో తెలుగు సినిమాఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా పాకింది. బాహుబలి సినిమా ప్రేక్షకులను అలరించడంతో పాటుగా ఎంతో మందిని ఇన్స్పిరేషన్ గా తీసుకునేలా చేసింది.. అప్పట్లో వరుస రికార్డులను సొంతం చేసుకున్న ఈ మూవీ రెండు సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ పేరుతో అక్టోబర్ 31న థియేటర్లోకి వచ్చేసింది. ఈ మధ్య రీ రిలీజ్ అవుతున్న సినిమాలు ఇలాంటి రికార్డుని నమోదు చేసుకోలేదు. రోజు రోజుకి ఈ సినిమా కలెక్షన్లు పెరుగుతూ వస్తున్నాయి. మరి మూడు రోజులకు ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఒకసారి తెలుసుకుందాం..

‘బాహుబలి ది ఎపిక్’ మూడు రోజుల కలెక్షన్స్..

రెబల్ స్టార్ ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క ,తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు ఈ సినిమాలో తమ నటనతో ఆకట్టుకున్నారు. ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్గా.. కేకే సెంథిల్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.. ఈ మూవీని ‘బాహుబలి ది ఎపిక్’ పేరుతో మళ్లీ థియేటర్లలోకి రిలీజ్ చేశారు. మళ్లీ ఈ సినిమాని థియేటర్లలో చూసేందుకు జనాలు ఆసక్తి కనబరుస్తుండటంతో సినిమాకు కలెక్షన్లు రోజురోజుకీ పెరుగుతున్నాయి.. అడ్వాన్స్ సేల్స్ ద్వారానే రూ.9.25 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇక.. అడ్వాన్స్ బుకింగ్స్‌.. రిలీజ్ అయిన ఫస్ట్ డే 4.5 కోట్లు వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో 10 కోట్లను అందుకుంది. అలాగే రెండో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా 9.5 కోట్లను రాబట్టిందని తెలుస్తుంది.. మూడో రోజు వరల్డ్ వైడ్ గా 28 కోట్లను వసూలు చేసింది.. ఈ వీకెండ్ ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది.. మరో వారానికి 50 కోట్లు వసూలు చేస్తూనేమో చూడాలి..

Also Read :నర్మద కాళ్ళు పట్టుకున్న సాగర్.. శ్రీవల్లి ప్రేమలో చందు.. ధీరజ్ తో ప్రేమ ఛాలెంజ్..

రీ రిలీజ్ లో బాహుబలి మరో రికార్డ్.. 

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమధ్య సినిమాలు రిలీజ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ఇప్పటివరకు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపించాయి.. ప్రభాస్ నటించిన సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. అందులో బాహుబలి మాత్రం వరుసగా రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తుంది. అక్టోబర్ 31న రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే 30 కోట్ల వరకు వసూలు చేయడం మామూలు విషయం కాదు.. ఇప్పటివరకు ఇదే టాప్ లో ఉంది. మరి గతంలో ఈ సినిమా మంచి కలెక్షన్లను అందుకుంది.. ఇప్పుడు కూడా అదే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లు మోత మోగిస్తుంది. మరో కొత్త సినిమా వచ్చేంతవరకు ఈ సినిమాని కొనసాగేలా కనిపిస్తుంది.. చివరి వరకు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో చూడాలి..

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×