Today Gold Rate: బంగారం ధరలు నేడు మళ్ళీ పెరిగాయి.. మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. కానీ మళ్లీ నాలుగు రోజులు నుంచి పెరుగుతూ వస్తుంది. దీంతో సోమవారం బంగారం, సిల్వర్ ధరలు ఇలా ఉన్నాయి.
నేటి బంగారం ధరలు..
నేడు స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,000 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,170 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,12,750 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,900 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.170 పెరిగిందని చెప్పవచ్చు..
రాష్ట్రంలో బంగారు ధరలు..
హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,23,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,900 వద్ద ఉంది.
విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,900 వద్ద పలుకుతోంది.
విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,12,900 వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,22,320 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,13,030 వద్ద ఉంది.
Also Read: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 6.3 తీవ్రతతో అల్లకల్లోలం
నేటి సిల్వర్ ధరలు ఇలా..
సోమవారం బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. నిన్నమొన్నటి వరకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. అయితే సిల్వర్ ధరలు నేడు అనగా సోమవారం స్వల్పంగా పెరిగాయి. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,66,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,68,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.2,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,54,000 వద్ద కొనసాగుతోంది.