NC 24 : టాలీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. ఇటీవల తండేల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సాయి దుర్గ తేజ్ నటించిన విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఇది అతని 24వ సినిమా.. తండేల్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ మూవీకి ఓవర్సీస్ హక్కులు రికార్డు స్థాయిలో నమోదైనట్లు తెలుస్తుంది.. గతంలో చైతు నటించిన ఏ సినిమాకు దక్కని హైయెస్ట్ రికార్డ్ ఇదే కావడం విశేషం. అయితే ఈ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.. కానీ రంగారెడ్డి లో జరిగిన బస్ ప్రమాదం వల్ల పోస్టర్ రిలీజ్ రేపటికి పోస్ట్ పోన్ అవుతుందని ట్విట్టర్ వేధికగా మరో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..
గత కొన్ని ఏళ్లుగా అక్కినేని నాగచైతన్య లవ్ స్టోరీ మూవీలలో నటించేవాడు. ఈమధ్య మాత్రం ఎమోషనల్ యాక్షన్, లవ్ ఎంటర్టైనర్ చిత్రాలలో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. అందులో భాగంగా రీసెంట్ గా తండేల్ మూవీలో నటించాడు.. ఈ మూవీ స్టోరీ ప్రేక్షకులను బాగా మెప్పించింది దాంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. థియేటర్లలోకి వచ్చిన తర్వాత మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ప్రస్తుతం విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో తన 24వ సినిమాని చేస్తున్నాడు నాగచైతన్య. ఈ మూవీ నుంచి తాజాగా హీరోయిన్ పోస్టర్ని రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ సడెన్గా రిలీజ్ చెయ్యలేదు. కొన్ని కారణాలు వల్ల రేపటికి వాయిదా వేస్తున్నాం అని ట్వీట్స్ చేశారు. రంగారెడ్డి బస్ యాక్సిడెంట్ పై చింతిస్తున్నాం.. అందుకే పోస్టర్ ను రేపటికి వాయిదా వేసినట్లు ట్వీట్ రాసుకొచ్చారు. ఇకపోతే ఈ మూవీ కూడా లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి సినిమాని డైరెక్టర్ కార్తీక్ ఎలాంటి స్టోరీ తో తెరకెక్కిస్తాడో తెలియాలంటే మరికొన్ని అప్డేట్స్ వచ్చేవరకు వెయిట్ చేయాలి.. ఇకపోతే ఈ మూవీ నుంచి అప్డేట్స్ రాకుండానే బిజినెస్ జరుగుతుంది. యుఎస్ లో ఈ సినిమా బిజినెస్ జరిగిపోయింది. ఓవర్సీస్ రైట్స్ 7 కోట్లకు పైగా అమ్ముడైనట్లు తెలుస్తుంది. గతంలో నాగచైతన్య నటించిన ఏ సినిమాకు ఇలాంటి బిజినెస్ జరగలేదు..
Also Read : బాక్సాఫీస్ వద్ద ‘బాహుబలి’ కలెక్షన్ల సునామీ.. జక్కన్న ఖాతాలో మరో రికార్డ్..
ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపోందుతుంది. మిథికల్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీలతో వస్తున్న సినిమాలకు ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరికేక్కించిన డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. నాగ చైతన్య కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు. పాపులర్ స్టార్స్, టాప్ టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం అవుతున్నారు.. అలాగే ఈ సినిమాలో చైతు సరసన మీనాక్షి చౌదరి నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. నవంబర్ 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..
Team #NC24 stands in solidarity with the families affected by the unfortunate incident in Chevella.
Wishing strength, recovery, and peace to all. 🙏 pic.twitter.com/FWkZd03gFH
— SVCC (@SVCCofficial) November 3, 2025