E-Paper
Advertisement

Singer Chinmayi: జానీ మాస్టర్ కి ఛాన్స్.. లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే

Singer Chinmayi: జానీ మాస్టర్ కి ఛాన్స్.. లైంగిక వేధింపులను ప్రోత్సహించడమే
Advertisement

Singer Chinmayi: సింగర్ చిన్మయి శ్రీపాద గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడదానికి అన్యాయం జరిగింది అని తెల్సిన మరుక్షణం.. ముందు చిన్మయి అక్కడ వాలిపోతుంది. ఆమెకు న్యాయం జరిగేవరకు పోరాడుతుంది. నిత్యం సోషల్ మీడియాలో ఒక 10 పోస్టులు వరకు సమాజంలో మగాళ్లు.. ఆడవారిపై ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో చెప్పేవే ఉంటాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఆడవారిని మోటివేట్ చేస్తూ.. మగాళ్లు ఎలా వారిని వేధిస్తున్నారో చెప్పుకొస్తుంది.

ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలను కూడా ఆమె వదలలేదు. కోలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా తనను వేధించినవారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో  అమ్మాయిలను వేధించిన సెలబ్రిటీల వరకు అందరినీ ఏకిపారేస్తూ ఉంటుంది. ఇక ఇండస్ట్రీలో అందరూ మర్చిపోయిన జానీ మాస్టర్ కేసును చిన్మయి మాత్రం మర్చిపోలేకపోతుంది. కొద్దిగా సమయం చిక్కినా జానీ మాస్టర్ కేసును తిరగతోడేస్తూ అతనిని శిక్షించాలని కోరుతూనే ఉంది.

Advertisement

గతేడాది కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై.. అతని దగ్గర పనిచేసే అసిస్టెంట్ డ్యాన్సర్ లైంగిక వేధింపుల కేసు పెట్టిన విషయం తెల్సిందే. తనను పెళ్లి చేసుకోవాలని బలవంత పెట్టాడని, మతం మార్చుకోమని టార్చర్ పెట్టారని చెప్పుకొచ్చింది. దీంతో అతనిపై కేసు నమోదు అయ్యింది. జైలుకు కూడా వెళ్ళాడు. ప్రస్తుతం బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ఈ కేసులో చాలామంది జానీ మాస్టర్ కు సపోర్ట్ గా నిలబడ్డారు. ఇండస్ట్రీ కూడా అతనికి సపోర్ట్ గా నిలబడి.. బెయిల్ నుంచిబయటకు బచ్చాకా మళ్లీ ఛాన్స్ లు ఇస్తుంది.

మాస జాతర, పెద్ది లాంటి సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా మారాడు. అందరూ ఈ కేసు గురించి మర్చిపోయారు కానీ, చిన్మయిమాత్రం మర్చిపోలేదు. తాజాగా మరోసారి జానీపై చిన్మయి మండిపడింది. కర్మ ఎవరిని వదలదు అంటూ శాపనార్థాలు పెట్టుకొచ్చింది. జానీ మాస్టర్ తో పాటు సింగర్ కార్తీక్ ను కూడా అందులో కలిపింది.

Advertisement

“నేను ఎప్పటికి అర్థం చేసుకోలేకపోతున్నాను.. జానీ మాస్టర్, సింగర్ కార్తీక్‌కు మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తున్నారా? వారిచేతికి అధికారం, ప్రభావం, డబ్బు ఇవ్వడం అంటే – ‘అత్యాచారం చెయ్’ అని మద్దతు ఇవ్వడమే. కర్మ థియరీ అనేది ఉంటే.. వారిని తిరిగి వచ్చి మళ్లీ కాటేస్తుంది” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం చిన్మయి పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. 

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×