Actress Kelley Mack Passed Away: హాలీవుడ్ చిత్రాలకే కాదు, టీవీ షోలకు కూడా మంచి ఆదరణ ఉంది. అలా టెలివిజన్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి కల్లీ మాక్(Kelly Mac Death). ది వాకింగ్ డెడ్, చికాగో మెడ్ వంటి టీవీ షోల్లో నటించింది ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. వరల్డ్ వైడ్గా కూడా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్. అలా తనదైన నటని, అభినయంతో మెప్పించిన ఈమె అతిచిన్న వయసులోనే కన్నుమూశారు. 33 ఏళ్ల కెల్లీ మాక్ మరణవార్త హాలీవుడ్ చిత్ర పరిశ్రమని, ఆమె అభిమానులకు దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
అరుదైన క్యాన్సర్ తో పోరాటం
కొంతకాలంగా క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్న ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు ఆమె సోదరి వెల్లడించింది. కెల్లి మాక్ మరణించిన తాజాగా ఆమె సోషల్ మీడియాలో ప్రకటించింది. కాగా గ్లియోమా అనే కేంద్ర నాడి వ్యవస్థకు సంబంధించిన క్యాన్సర్తో వ్యాధితో ఆమె బాధపడుతున్నట్టు గతేడాది ఆమె తెలిపింది. గ్లియోమా అనేది అరుదైన క్యాన్సర్. చాలా కొద్ది మందిలో మాత్రమే ఈ వ్యాధి లక్షణాలు ఉంటాయి. ఇది అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతూ మనిషి నాడీ వ్యవస్థను దెబ్బ తీస్తుంది. దీనికి చికిత్స అంటూ ఉన్న చివరికి మహమ్మారికి బలైవ్వాల్సిందే. ఇప్పుడు కెల్లి ఈ క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా పోరాడిన ఆమె చివరికి ఈ మహామ్మారికి బలైంది. కొద్ది రోజుల ఆమె ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో ఆమె ఇటీవల తుదిశ్వాస విడిచారు.
సినీ ప్రముఖుల సంతాపం
ఆమె మృతిపై హాలీవుడ్ సినీ ప్రముఖులు, సహా నటీనటులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో నివాళులు అర్పిస్తున్నారు. కెల్లి సోదరి ఈ విషాద వార్తను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. కెల్లి మరణవార్తను వెల్లడిస్తూ.. “చివరికి మనందరం కూడా అక్కడికే వెళ్లాలి” అంటూ భావోద్వేగానికి లోనైంది. పలు టీవీ షోల్లో నటించి కెల్లీ మాక్ తనదైన నటనతో విమర్శకుల ప్రవంసలు అందుకున్నారు. ఆమె సహాజనమైన నటనతో ఆడియన్స్ని ఆకట్టుకున్న ఆమె మరణం హాలీవుడ్ టెలివిజన్కు తీరని లోటు అంటూ దిగ్భ్రాంతి వ్యక్తి చేస్తున్నారు.