Malaysia Singapore Tour: చాలా మందికి ఫారిన్ ట్రిప్ వెళ్లాలనే ఆలోచన ఉంటుంది. కానీ, ఎక్కువ ఖర్చు అవుతుందేమోనని భయపడుతారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ఫారిన్ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. భారతీయులు ఎక్కుగా ఇష్టపడే సింగపూర్, మలేసియాలో పర్యాటించేలా టూర్ ప్లాన్ చేసింది. తక్కువ ధరలో అద్భుతమైన సౌకర్యాలతో 7 రోజుల ఫారిన్ టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీకి ‘మ్యాజికల్ మలేసియా విత్ సింగపూర్ సెన్సేషన్’ పేరుతో ఈ ప్యాకేజీని పరిచయం చేసింది. ఈ టూర్ ఆగస్టు 11న ప్రారంభం కానుంది. కేవలం 34 మంది పర్యాటకులను మాత్రమే తీసుకెళ్లనుంది.
మలేషియా, సింగపూర్ టూర్ ప్యాకేజీ వివరాలు
7 రోజుల ఈ విదేశీ ప్రయాణం హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణంతో మొదలవుతుంది. ఈ టూర్ 6 రాత్రులు 7 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్ కు కేవలం 34 మందికి ఐఆర్‌సీటీసీ అవకాశం కల్పిస్తోంది. ఈ టూర్ ఆగష్టు 11న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి రాత్రి 11 గంటలకు విమాన ప్రయాణంతో ప్రారంభం అవుతుంది.
⦿ తొలి రోజు: శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రాత్రి 11 గంటలకు విమాన ప్రయాణం ద్వారా టూర్ మొదలవుతుంది.
⦿ రెండో రోజు: రెండో రోజు ఉదయం కౌలాలంపూర్ చేరుకుని హోటల్ కు వెళ్తారు. మధ్యాహ్నం నుంచి సైట్ సీయింగ్ ఉంటుంది. కింగ్స్ ప్యాలెస్, ఇండిపెండెన్స్ స్క్వేర్, నేషనల్ మాన్యుమెంట్, పెట్రోనాస్ ట్విన్ టవర్స్, చాక్లెట్ ఫ్యాక్టరీ చూసే అవకాశం కల్పిస్తారు. రాత్రి డిన్నర్ తర్వాత కౌలాలంపూర్ లోనే బస చేస్తారు.
⦿ మూడవ రోజు: మూడో రోజు బటు కేవ్స్, గెంటింగ్ హైలాండ్స్ ను చూసే అవకాశం కల్పిస్తారు. రాత్రికి కౌలాలంపూర్ కు తిరిగి వచ్చాక డిన్నర్ చేసి అదే హోటల్ లో బస చేస్తారు.
⦿ నాలుగో రోజు: నాలుగో రోజు బ్రేక్ ఫాస్ట్ అయ్యాక పుత్రజయకు వెళ్తారు. లంచ్ తర్వాత రోడ్డు మార్గం ద్వారా సింగపూర్ చేరుకుంటారు. రాత్రికి డిన్నర్ చేసి హోటల్ లో బస చేస్తారు.
⦿ ఐదవ రోజు: సింగపూర్ లో ఆర్కిడ్ గార్డెన్, మెర్లియన్ పార్క్, సింగపూర్ ఫ్లైయర్ రైడ్, మేడమ్ టుస్సాడ్స్, వింగ్స్ ఆఫ్ టైమ్ షో చూస్తారు. రాత్రికి సింగపూర్ లోనే హోటల్ లో బస చేస్తారు.
⦿ ఆరవ రోజు: ఆ రోజు మొత్తం యూనివర్సల్ స్టూడియోస్ చూసే అవకాశం కల్పిస్తారు. రాత్రి డిన్నర్ అయ్యాక హోటల్ లోనే బస చేస్తారు.
⦿ ఏడవ రోజు: టూర్ లో భాగంగా చివరి రోజున బర్డ్ ప్యారడైజ్ కు వెళ్తారు. షాపింగ్, లంచ్ తర్వాత ఎయిర్ పోర్ట్ చేరుకుని సాయంత్రం హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కుతారు.
టూర్ ప్యాకేజీ ధరలు
⦿ ఒక్కరికి రూ.1,49,230
⦿ డబుల్ షేరింగ్ రూ.1,21,980
⦿ ట్రిపుల్ షేరింగ్ రూ.1,21,860
⦿ పిల్లలకు(5–11 ఏండ్లు) విత్ బెడ్ రూ.1,09,560
⦿ పిల్లలకు వితవుట్ బెడ్ రూ.92,990
ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు
⦿ రాను,పోను విమాన టికెట్లు, వీసా ఛార్జీలు
⦿ హోటల్‌లో బస
⦿ 5 బ్రేక్ ఫాస్ట్ లు, 6 లంచ్‌లు, 6 డిన్నర్లు
⦿ గైడ్ సేవలు
⦿ ట్రావెల్ ఇన్సూరెన్స్
ఇక ఈ టూర్ ప్యాకేజీకి అర్హత పొందాలంటే కనీసం 6 నెలల వ్యాలిడిటీ ఉన్న పాస్‌పోర్ట్ అవసరం ఉంటుందని ఐఆర్‌సీటీసీ అధికారులు వెల్లడించారు.
Read Also: పంచ జ్యోతిర్లింగ దర్శనం.. సికింద్రాబాద్ నుంచి టూర్ ప్రారంభం!