BigTV English
Advertisement

Jr. NTR: వంట చేయటం ఇష్టం.. పిల్లల కోసం అలవాట్లు మార్చుకున్న తారక్.. నిజంగా గ్రేట్!

Jr. NTR: వంట చేయటం ఇష్టం.. పిల్లల కోసం అలవాట్లు మార్చుకున్న తారక్.. నిజంగా గ్రేట్!

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలో మాత్రమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక త్వరలోనే ఈయన నటించిన వార్ 2 సినిమా (War 2 Movie)ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇటీవల ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన అలవాట్ల గురించి అభిమానులతో పంచుకున్నారు.


వంట చేయటంలో ఎన్టీఆర్ దిట్ట…

ఎన్టీఆర్ నటన, నాట్యంలో మాత్రమే కాదండోయ్ వంట చేయడంలో కూడా దిట్ట అని అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ చేతివంట రుచి అద్భుతంగా ఉంటుందని ఇప్పటికే ఎంతో మంది పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక ఈయన బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్న సమయంలో స్వయంగా హౌస్ లోకి వెళ్లి మరి బిర్యాని చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇంట్లో కూడా తనకు వీలైనప్పుడల్లా వంటలు చేస్తానని పలు సందర్భాలలో తారక్ తెలియజేశారు. తన వంట రుచి అద్భుతంగా ఉంటుందని రెస్టారెంట్ ప్రారంభిద్దామంటూ ప్రణతి(Pranathi) తమాషాలు చేస్తుంది అంటూ ఓ సందర్భంలో ఎన్టీఆర్ తెలియజేశారు.


బిర్యానీ అద్భుతంగా ఉంటుంది..

ఈ విషయం గురించి మరోసారి ఎన్టీఆర్ మాట్లాడుతూ… నా భార్య, పిల్లల కోసం అలాగే స్నేహితుల కోసం వంట చేయడం(Cooking) నాకు చాలా ఇష్టమని తెలిపారు. తాను పునుగులు బాగా వేస్తానని, నేను చేసే బిర్యాని కూడా చాలామంది ఇష్టపడతారు అంటూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలియజేశారు. ఇక నటుడిగా నిత్యం సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న తారక్ ఒకానొక సమయంలో వారంలో ఏడు రోజులపాటు సినిమా షూటింగ్ పనులలోనే బిజీగా ఉండే వాడినని తెలిపారు. అయితే పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం కొన్ని అలవాట్లు మార్చుకున్నానని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆదివారం షూటింగ్స్ బంద్…

వారంలో ఏడు రోజులు షూటింగ్లో పాల్గొనడం వల్ల తాను ఇంట్లో ఒకరోజు కూడా తన కుటుంబ సభ్యులతో సమయం గడపలేకపోతున్నానని అందుకే ఆదివారం ఎలాంటి షూటింగ్స్ కు వెళ్లకుండా ఆరోజు మొత్తం తన కుటుంబ సభ్యులతో గడుపుతానని తెలిపారు. ముఖ్యంగా అభయ్, భార్గవ్ తో సమయం గడపడం కోసమే తాను ఈ పద్ధతిని మార్చుకున్నాను అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ఈయన నటించిన వార్ 2 సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hruthik Roshan) తో కలిసి ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమా పై ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్లను కూడా వేగవంతం చేస్తున్నారు.

Also Read: Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Related News

Chinmayi : ఇలాంటి మగాళ్లు చచ్చిపోవాలి చిన్మయి షాకింగ్ కామెంట్స్ 

Raviteja: అప్పుడు హరీష్ శంకర్, ఇప్పుడు భాను భోగవరపు, రవితేజ మళ్ళీ ఆదుకుంటాడా?

Vijay Sethupathi: మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతి.. అప్పుడే షూటింగ్!

Mani Ratnam: మణిరత్నం ను రిజెక్ట్ చేసిన శింబు, థగ్ లైఫ్ ఎఫెక్ట్

Telugu industry : పచ్చళ్ళ పాప రియాలిటీ షో కంటెస్టెంట్, పూసల పాప హీరోయిన్ అంతా సోషల్ మీడియా పుణ్యమే

Akhanda 2  Update: అఖండ ఫస్ట్ సింగిల్ సిద్ధం, దీని కోసమే తమన్ రాజా సాబ్ పక్కన పెట్టేసాడా? 

Kamal Hassan -Rajinikanth: ఇట్స్ ఆఫీసియల్.. కమల్ రజనీకాంబో సినిమా ఫిక్స్.. పోస్ట్ వైరల్!

Balakrishna: ఫ్యాన్స్ కి షాక్ … ఆ రెండు సినిమాలను రిజెక్ట్ చేసిన బాలయ్య!

Big Stories

×