Road Incident: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ఎస్ఎంఆర్ఆర్ ట్రావెల్స్‌కి చెందిన ఓ ప్రైవేట్ బస్సు హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై అదుపుతప్పి డివైడ్‌ను ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా అవతల వైపుగా వెళుతున్న బొలెరో వాహనాన్ని ఢీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 30 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం స్థానిక ప్రయాణికులు సహాయ చర్యలు చేపట్టి సమీపంలోని హాస్పిటల్‌కి తరలించారు. ప్రమాదం కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అతివేగమే దీనికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.