BigTV English

OG Movie: పాటలన్నీ సూపర్ ఉన్నాయి, ఇంకో ఆరెంజ్ అవ్వకపోతే అదే హ్యాపీ

OG Movie: పాటలన్నీ సూపర్ ఉన్నాయి, ఇంకో ఆరెంజ్ అవ్వకపోతే అదే హ్యాపీ

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓ జి. ఈ సినిమా కోసం ఎదురు చూడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ముందుగా ఈ సినిమా దర్శకుడు సుజిత్ పవన్ కళ్యాణ్ కి స్వతహాగా వీరాభిమాని. తమ అభిమాని నటుడు ఏం చేస్తే బాగుంటుందో అభిమానులకి ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా హిట్ అయినప్పుడు కూడా సుజిత్ చేసిన హడావిడి వీడియోలు ఇప్పటికీ వైరల్ అవుతాయి.


పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ సినిమా చేస్తున్నాడు అన్నప్పుడే ఆ వీడియోలు బయటకు వచ్చాయి. అంతకుముందు చాలామంది చూసినా కూడా వాటిని పెద్దగా పట్టించుకోలేదు. మొత్తానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఓజి సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదలయ్యాయి. విడుదలైన మూడు పాటలు కూడా ఒకదాన్ని మించి మరొకటి ఉన్నాయి. సినిమా మీద హైప్ రోజు రోజుకి పెరిగిపోతుంది.

ఆరెంజ్ కాకపోతే చాలు 

కొన్నిసార్లు పాటలు విపరీతమైన సక్సెస్ అయిపోయిన కూడా సినిమా పోయిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు ఇది ఎక్కువ శాతం జరుగుతుంది. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు ఫెయిల్ అయిన కూడా ఆడియో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అన్ని పాటలు సక్సెస్ఫుల్.


బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాకి హరీష్ జయరాజ్ సంగీతం అందించారు. అప్పట్లో ఈ పాటలన్నీ కూడా ఒక సంచలనం. సినిమా మీద విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓ జి సినిమా పాటలు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఆరెంజ్ సినిమాకి జరిగినట్టు ఓజీకి జరగకూడదు అని ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు. ఆడియోతో పాటు సినిమా కూడా మంచి సక్సెస్ అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరగవచ్చు.

నెక్స్ట్ లెవెల్ హైప్ 

ఈ సినిమాకి సంబంధించి మామూలు హైప్ లేదు. వాస్తవానికి ఈ హైట్ తో చిత్ర యూనిట్ కి కూడా కొద్దిపాటి టెన్షన్ ఉండి ఉండాలి. అలానే ట్విట్టర్లో డివివి ఎంటర్టైన్మెంట్స్ అకౌంట్ ఈ హైప్ ని మరింత రెట్టింపు చేస్తుంది. ఒక్క ట్వీట్ వేసినా కూడా ఫ్యాన్స్ అందరూ క్షణాల్లో వచ్చి రియాక్ట్ అయిపోతారు. అదే స్థాయిలో డి వి ఎంటర్టైన్మెంట్స్ అకౌంట్ కూడా ఈ అభిమానులకు రిప్లై ఇస్తుంది.

Also Read: Nithiin: అంతా ఉత్తిదే నితిన్ ఆ దర్శకుడితో సినిమా చేయట్లేదు

Related News

Tollywood: తల్లి కాబోతున్న వెంకటేష్ హీరోయిన్.. ఈ ఏడాదే మొదటి బిడ్డకు ఆహ్వానం!

Malaika Arora : శునకంతో కలిసి చెమటలు చిందిస్తున్న హాట్ బ్యూటీ.. నెటిజన్స్ దారుణమైన ట్రోల్స్..

Urvashi Rautela: నేడు ఈడీ విచారణకు ఊర్వశీ.. ఉత్కంఠగా మారిన పరిస్థితి!

Dharma Mahesh : ఆ బ్రాండ్ కోసమే గౌతమి ఇంత కుట్ర చేసిందా..? ఆర్జే చెప్పిన పచ్చి నిజాలు..

Ram Charan: పెద్ది కోసం బాలయ్య తల్లి.. పెదవి విరుస్తున్న ఫ్యాన్స్.. అసలేమైందంటే?

Nithiin: అంతా ఉత్తిదే నితిన్ ఆ దర్శకుడితో సినిమా చేయట్లేదు

Actress Meena: నటి మీనా కన్నీళ్లు.. భర్త చనిపోయిన వారానికే ఆ వార్తలు..?

Big Stories

×