Tollywood: ప్రస్తుత కాలంలో హీరోయిన్లు కెరియర్ పై ఫోకస్ పెట్టడం వల్ల వ్యక్తిగత జీవితంపై పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. తమ తోటి నటీనటులు, పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే.. మరికొంతమంది పెళ్లికి దూరం అంటున్నారు. ఇంకొంతమంది పెళ్లి చేసుకొని కూడా పిల్లలు కనడానికి ఆసక్తి కనబరచడం లేదు. కానీ మరికొంతమంది ఏ టైంలో జరిగే ముచ్చట ఆ టైంలో జరగాలంటూ ఆ ముచ్చట్లను కూడా నెరవేర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా తల్లి కాబోతోంది అనే వార్త అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తున్నా.. ఇందులో ఎంత నిజం ఉంది అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. వెంకటేష్ హీరోయిన్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న కత్రినా కైఫ్.. విక్కీ కౌశల్ ను వివాహం చేసుకున్న తర్వాత మరింత వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా ఈ జంట వివాహం ఎప్పుడు హాట్ టాపికే. ఎందుకంటే వయసులో తనకంటే చిన్నవాడైన విక్కీ కౌశల్ ను ఈమె వివాహం చేసుకుంది. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వాడా లో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తో ఈ జంట ఒక్కటి అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు కొంత దూరమైన ఈమె.. కెరియర్ కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. అందులో భాగంగానే తరచూ ప్రెగ్నెంట్ అయింది అని రూమర్లు వినిపిస్తున్నాయి. వీటిపై అటు వీరు కూడా ఖండిస్తూ వచ్చారు. అంతేకాదు అలాంటిది ఏమీ లేదు ఏదైనా ఉంటే మేమే చెబుతామంటూ ఈ జంట క్లారిటీ కూడా ఇచ్చింది. అయినా సరే రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అసలు సంగతి ఏంటంటే?
అలా కెరియర్ కంటే వ్యక్తిగత జీవితానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ఈ జంట ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలకబోతున్నారు అంటూ ఆంగ్ల మీడియాలో పలు కథనాలు వెలబడుతున్నాయి. దీని ప్రధాన కారణం కత్రినా గత కొంతకాలంగా సినిమాల్లో కనిపించకపోవడం.. అటు స్కూల్ మీడియాలో కూడా వీరు యాక్టివ్ గా కనిపించడం లేదు. అందుకే ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈ జంట నుండి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలవడలేదు కాబట్టి ఇది నిజమా? కాదా? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ జంటపై గత నాలుగు సంవత్సరాలుగా ఇలాంటి రూమర్స్ వినిపిస్తూనే ఉండడం గమనార్హం.
కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ కెరియర్..
కత్రినా కైఫ్ విషయానికి వస్తే.. ‘ మల్లీశ్వరి’ సినిమాలో వెంకటేష్ కి జోడిగా నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె.. చివరిగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో కలిసి ‘మేరీ క్రిస్మస్’ అనే సినిమాలో నటించింది. అటు ఈమె భర్త విక్కీ కౌశల్ ఇటీవల ‘ఛావా’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం రణబీర్, ఆలియా భట్ లతో కలిసి ‘లవ్ అండ్ వార్’ అనే సినిమాలో నటిస్తున్నారు. విక్కీ కౌశల్ సినిమాలు చేస్తున్నారు కానీ కత్రినా కైఫ్ సినిమాలకు దూరం కావడంతోనే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వార్తలు పుట్టుకొస్తున్నాయి. మరి దీనిపై ఈ జంట శుభవార్త చెప్పాలని అభిమానులు కోరుతూ ఉండడం గమనార్హం.
ALSO READ:Urvashi Rautela: నేడు ఈడీ విచారణకు ఊర్వశీ.. ఉత్కంఠగా మారిన పరిస్థితి!