Intinti Ramayanam Today Episode September 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ నాకెందుకు అబద్ధం చెప్పాడు అది ఆలోచిస్తూ ఉంటుంది చాముండేశ్వరి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని అడగాలి అనుకుంటుంది. ఆ తర్వాత అక్షయ్ ఏదో ఫైల్ కోసం వస్తాడు. అది చూస్తున్న చాము అక్షయ్ అపద్దం చేస్తున్నాడా? లేదా అని తెలుసుకోవడం చేస్తుంది. అక్షయ్ మీ పెళ్లి ఎలా జరిగింది.. ప్రేమ, పెద్దలు చేసిన పెళ్లినా అని అడుగుతుంది. ఈవిడ ఏంటి నాకు ఎప్పుడు చుక్కలు చూపిస్తుంది అని అనుకుంటాడు. ప్రేమ పెళ్లి మేడమ్ అని చెప్తాడు. అవని బాగా చూసుకుంటుందా అని అంటాడు. బాగా చూసుకుంటుంది మేడమ్ అని అంటాడు. ఇక చాము వరుసగా ప్రశ్నలను అడిగి తెలుసుకుంటుంది. ఇష్టమైన కలర్, ఫుడ్ అన్నీ అడుగుతుంది. కానీ అక్షయ్ తెలియదు అనగానే షాక్ అవుతుంది. అక్షయ్ పై అనుమాన పడుతుంది.. అవనీని బాస్ కి నిజం తెలిసేలా చేసిందని అక్షయ్ సీరియస్ అవుతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని అక్షయ్ ల మధ్య దూరం ఇంకా అలానే ఉంది. రేపు వాళ్ళ పెళ్లి రోజు కదండీ మనము ఆరోజున గ్రాండ్ గా చేయాలి అని పార్వతి అంటుంది. అది నిజమే వాళ్ళ పెళ్లిరోజుని మనము గ్రాండ్ గా చేయాలి కానీ అక్షయ్ ఒప్పుకుంటాడా అని రాజేంద్రప్రసాద్ అంటాడు. వాన్ని ఎలాగైనా ఒప్పించి తీరాల్సిందే ఎందుకంటే అవని మనకోసం ఎంతో చేస్తుంది మనం ఎంత చీ కొట్టినా మనందరం బాగుండాలని కోరుకుంది. నిన్న కూడా మన షష్టిపూర్తి బాగా జరగాలని కోరుకుందే తప్ప ఏమి చేయలేదు కదా అని అంటుంది.. ఇక వాళ్ళిద్దర్నీ ఒప్పించి మనం మ్యారేజ్ డే కి కావలసినది ఏర్పాట్లు చేద్దామండి అని పార్వతి అంటుంది.
ఇక అవని భరత్ ని తన వైపు తిప్పేసుకున్న పల్లవి అని అనుమాన పడుతుంది. శ్రియాను మార్చేసినట్టే తమ్ముని కూడా పల్లవి మార్చేసింది అని తర్వాత బాధపడుతుంది. ఇప్పుడు అవని బయట వెళ్తూ ఉండగా.. పల్లవి అక్షయ్ వాళ్ళ ఆఫీసులోని అమ్మాయిని పల్లవిని చూసి షాక్ అవుతుంది. మీరు పంపిన డబ్బులు వచ్చాయి మేడం మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఇస్తాను. అక్షయ్ గారిపై మా మేడం కి అనుమానం వచ్చింది ఇంకా తనని శాడిస్ట్ లాగా పీకు తింటుంది అని అంటుంది.
ఆ మాట వినగానే అవని షాక్ అవుతుంది. ఇదంతా పల్లవి ప్లాన పల్లవికి కచ్చితంగా బుద్ధి చెప్పాలి అని అనుకుంటుంది. పల్లవికి సరైన రీతిలో బుద్ధి చెప్పకపోతే అస్సలు ఆగేటట్టు లేదు కదా అని అవని అంటుంది. ఇక ఈ విషయాన్ని ఎలాగైనా సరే త్వరలోనే కనిపెట్టి పల్లవికి బుడ్డి చెప్పాలి అని అవని అనుకుంటుంది. ఇంటికి వెళ్ళినా అవనికి రాజేంద్రప్రసాద్ పార్వతి మీ పెళ్లి రోజు వేడుకని చేయాలని అనుకుంటున్నామని చెప్తారు. మీ పెళ్లి రోజు చేయాలని మీ అత్తయ్య అనుకుంటుందమ్మా.. నువ్వేమంటావో అని అవనితో రాజేంద్రప్రసాద్ అంటాడు.
ఇది ఆయన అయితే కచ్చితంగా ఒప్పుకోడు అత్తయ్య.. ఏం చేస్తారో చూడాలి అని అనుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళ బాస్ అక్షయ్ కి ఇచ్చిన టాస్క్ ని గుర్తు చేసుకొని పెళ్లిరోజు చేసుకుందాం మంచిదే కదా అని అనుకుంటుంది. నువ్వు ఇంత త్వరగా ఒప్పుకుంటావని అస్సలు అనుకోలేదమ్మా అని పార్వతి అంటుంది. ఇక అక్షయ్ కూడా ఒప్పుకుంటే బాగుంటుంది కదా వాడిని ఒప్పిదం పదండి అని అక్షయ్ దగ్గరికి వెళ్తారు. అక్షయ్ పెళ్లిరోజు వేడుక గురించి చెప్పగానే మొదట కాస్త కాస్త బస్సులాడిన సరే.. ఆ తర్వాత మేడంకి వచ్చిన అనుమానం పోతుందని అనుకుంటుంది.
అక్షయ్ అవని మాట వినగానే నిజమే అని అనుకుంటాడు. మొత్తానికి అక్షయ్ పెళ్లిరోజు వేడుకలు జరిపించుకోవడానికి ఒప్పుకుంటాడు. ప్రణతి ఒంటరిగా కూర్చోవడం చూసిన భరత్ ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతాడు. పెళ్లయితే త్వరగా చేసుకున్నాం కానీ మన చేతిలో రూపాయి కూడా లేదు. ఇప్పుడు మనం ఏం కావాలన్నా ఎవరో ఒకరు అడగాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రణతి అంటుంది. మాటలు విన్నా కమల్ ప్రణతికి డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు.
Also Read : ప్రభావతి చేత షాప్ ఓపెనింగ్.. స్పెషల్ గెస్టుగా శోభన.. మీనాకు ఘోర అవమానం..
ఇక పల్లవి మీకోసం నేను ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ తీసుకొచ్చాను అని అంటుంది.. ఏంటి వదిన అని ప్రణతి అడుగుతుంది. ఇంటి తాళాలు ఈ ఇంటి పెత్తనం నీ చేతిలో పెడుతున్నాను. నీ ఇష్టం వచ్చినట్లు నీకు కావలసినవి కొనుక్కో పెళ్లయిన వాళ్లకి కోరికలు ఉంటాయి కదా అని అనుకుంటుంది. ఉన్నారు కదా తాళాలు ఇచ్చి పల్లవి శ్రియా దగ్గరికి వెళ్ళగానే చంప పగలగొడుతుంది. తాళాలు నీ దగ్గర నా దగ్గర ఉండాలి.. ఆ ప్రణతికి ఎందుకు ఇచ్చావు అని అంటే ఒసేయ్ బుర్ర లేని దాన నేను ఆ ప్రణతికించింది వేరే దానికి కాదు. కేవలం వాళ్లని నా వైపు తిప్పుకోడానికే ఇదంతా చేశానని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో అవని అక్షయ్ ఇద్దరు కలిసి మ్యారేజ్ డే సెలెబ్రేషన్ చేసుకోవడం కోసం మేడం ని పిలవడానికి వెళ్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..