Nithiin: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో శ్రీను వైట్ల కూడా ఒకరు. నీకోసం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీను వైట్ల. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ సక్సెస్ అందుకుంది. శ్రీను వైట్ల పేరు చెప్పగానే ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఫిలిమ్స్ గుర్తొస్తాయి. ఇప్పటికీ శ్రీను వైట్ల సినిమాల్లోని కొన్ని మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ ను డిజైన్ చేసిన ఘనత శ్రీనువైట్లకు ఉంది.
బాద్షా సినిమా తర్వాత శ్రీను వైట్ల చేసిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ కూడా ఊహించిన సక్సెస్ తీసుకురాలేకపోయింది. మొత్తానికి రీసెంట్గా గోపీచంద్ హీరోగా నటించిన విశ్వం సినిమా మంచి సక్సెస్ సాధించింది. కొంతమేరకు శ్రీను వైట్ల ఈ సినిమాతో బ్యాక్ అయ్యాడు అని చెప్పాలి.
శ్రీను వైట్ల దర్శకత్వంలో నితిన్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ సినిమా చేయబోతుంది అని వార్తలు వచ్చాయి. అయితే దాదాపు ఈ వార్తలు అందరూ నిజమే అని అనుకున్నారు. కానీ ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు.
మరోవైపు నితిన్ కూడా హిట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. భీష్మ సినిమా తర్వాత నితిన్ కెరీర్ కి సరైన సక్సెస్ఫుల్ సినిమా పడలేదు. ఎంతో నమ్మి చేస్తున్న ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ ను మిగులుస్తుంది. రీసెంట్ గా వచ్చిన తమ్ముడు సినిమా కూడా ఊహించిన సక్సెస్ సాధించలేదు. అలానే మరోవైపు నితిన్ చేయాల్సిన ఎల్లమ్మ ప్రాజెక్టు కూడా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
నితిన్ సినిమాలు వరుసగా ఫెయిల్ అవుతున్న తరుణంలో, విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించిన. ఈ సినిమాలో బీభత్సమైన డాన్సులు లేకపోయినా కూడా ఒక సింపుల్ లవ్ స్టోరీ మంచి సక్సెస్ తీసుకొచ్చింది.
ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఈ ఆడియో లాంచ్ కు హాజరైన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు. నితిన్ కూడా స్వతహాగా పవన్ కళ్యాణ్ కి ఎంత పెద్ద వీరాభిమాని అని ఆ ఈవెంట్ లోనే తెలిసింది. ఆ తరువాత పవన్ కళ్యాణ్ రిఫరెన్సులు నితిన్ సినిమాల్లో కూడా పెట్టడం మొదలుపెట్టాడు. అవి కూడా గుండెజారి గల్లంతయింది వంటి సినిమాకు వర్కౌట్ అయ్యాయి.
Also Read: Bigg Boss 9: నామినేషన్స్ డే, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. కొట్టుకోవడమే మిగిలిపోయింది అది కూడా చేసేయండి