BigTV English
Advertisement

BMW S 1000 R: BMW కొత్త బైక్ వచ్చేసింది.. ధర అక్షరాలా రూ. 20 లక్షలు!

BMW S 1000 R: BMW కొత్త బైక్ వచ్చేసింది.. ధర అక్షరాలా రూ. 20 లక్షలు!

2025 BMW S 1000 R Launched:

విలాసవంతమైన కార్లు, బైకుల తయారీ సంస్థ మరో అదిరిపోయే టైవీలర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో మాదిరిగానే లగ్జరీ బైక్ ను వినియోగదారులకు పరిచయం చేసింది. S 1000 R పేరుతో విడుదలైన ఈ బైక్ ధరను రూ. 19.90 లక్షలుగా ఫిక్స్ చేసింది. ఇది ఎక్స్ షోరూమ్ ధర కాగా, ఆన్ రోడ్ వచ్చే సరికి మరికొంత ధర పెరిగే అవకాశం ఉంటుంది. గత బైకులతో పోల్చితే ఇందులో సరికొత్త ఫీచర్లను పరిచయం చేసింది.


S 1000 R ఇంజిన్ ప్రత్యేకతలు..

S 1000 R బైక్ 999cc, లిక్విడ్-కూల్డ్, నాలుగు-సిలిండర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 11,000rpm దగ్గర 170bhp, 9,250rpm దగ్గర 114Nm టార్క్‌ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కొత్త బైక్ కేవలం 3.2 సెకన్లలో 0-100kmph వేగాన్ని అందుకుంటుంది. ఈ వాహన గరిష్ట వేగాన్ని 250kmphకి పరిమితం చేసినట్లు BMW సంస్థ వెల్లడించింది.

S 1000 R ఫీచర్ల గురించి..

S 1000 R బైక్  ఫీచర్ల విషయానికొస్తే, ఈ బైక్‌లో డేటైమ్ రైడింగ్ లైట్లు, M క్విక్ యాక్షన్ థ్రోటిల్, రైడింగ్ మోడ్‌లు, ABS ప్రో, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ తో పాటు కనెక్టివిటీ, నావిగేషన్‌ తో కూడిన 6.5-అంగుళాల TFT డిస్‌ప్లేతో కూడిన హెడ్‌ లైట్ ప్రో లభిస్తుంది. దీనితో పాటు, ఈ బైక్‌ లో BMW  ఇంటెలిజెంట్ ఎమర్జెన్సీ కాల్ ఫీచర్ E-కాల్, సీటు కింద USB టైప్-C ఛార్జర్ ఉన్నాయి.


S 1000 R బైక్ డిజైన్..

S 1000 R బైక్ డిజైన్ మరింత స్టైలిష్ గా ఉంటుంది. ఈ బైక్ లో ఫ్యూయెల్ ట్యాంక్ ఆకారం ఉన్న విధానం,  షార్ప్ ట్యాంక్ పొడిగింపులు, బయట కనిపించే సబ్‌ ఫ్రేమ్ మరింత ఆకట్టుకుంటుంది.

ఎవరికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుందంటే?

S 1000 R బైక్ రైడర్లు డైనమిక్, కంఫర్ట్, M స్పోర్ట్ లాంటి ఆప్షనల్ ప్యాకేజీల నుంచి ఎంచుకోవచ్చు, వీటిలో క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, షిఫ్ట్ అసిస్టెంట్, M లైట్‌వెయిట్ బ్యాటరీ, ఫోర్జ్డ్ వీల్స్ లాంటి అధునాతన భాగాలు ఉంటాయి. S 1000 R మూడు రంగు ఎంపికలలో వస్తుంది. వాటిలో ఒకటి బ్లాక్‌ స్టార్మ్ మెటాలిక్, రెండు స్టైల్ స్పోర్ట్‌ తో బ్లూఫైర్/ఎల్లో, మూడోది M ప్యాకేజీతో లైట్‌వైట్ యూని/ఎం మోటార్‌ స్పోర్ట్ బైక్. అన్ని వర్గాల రైడర్లకు ఈ బైక్ మరింత అనుకూలంగా ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

Read Also: ప్రొడక్ట్స్, బ్రాండ్ల పేరు మీద ఉండే TM, R సింబల్స్‌ కు అర్థం ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు!

Related News

Gold Silver Rates: దిగిరానున్న బంగారం, వెండి ధరలు.. దిగుమతులపై బేస్ రేటు తగ్గించిన కేంద్రం

Postal Senior Citizens Scheme: సీనియర్ సిటిజన్స్ కు సూపర్ సేవింగ్స్ స్కీమ్.. రూ.30 లక్షల డిపాజిట్ పై రూ. 12.30 లక్షల వడ్డీ

LPG Gas Price: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు.. చిరు వ్యాపారులకు స్వల్ప ఊరట

Wrong UPI Payment: పొరపాటున వేరే UPIకి డబ్బులు పంపించారా? సింపుల్ గా ఇలా చేస్తే రిటర్న్ వచ్చేస్తాయ్!

Tata Bike 125 CC: టాటా సంస్థ.. మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందా?

Today Gold Rate: పసిడి ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Mukunda Jewellery: హైదరాబాద్‌లో ముకుందా జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్..

Financial Changes: ఆధార్ నుంచి బ్యాంక్ వరకు.. నవంబర్ 1 నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే

Big Stories

×