BigTV English

Actress Meena: నటి మీనా కన్నీళ్లు.. భర్త చనిపోయిన వారానికే ఆ వార్తలు..?

Actress Meena: నటి మీనా కన్నీళ్లు.. భర్త చనిపోయిన వారానికే ఆ వార్తలు..?

Actress Meena: అలనాటి ముద్దుగుమ్మ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అది కొద్దిగా కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. ఈమధ్య మీనా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇక ఇటీవలే ఈమె భర్త సాగర్ అనారోగ్య సమస్యలతో పోరాడుతూ చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన చనిపోయిన తర్వాత మీనా రెండు పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు పై మీనా స్పందించి క్లారిటీ ఇచ్చారు.


నా భర్త చనిపోయిన వదల్లేదు..

యాక్టర్ మీనా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇప్పుడు తన ఏజ్ కు తగ్గ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. అప్పట్లో హీరోయిన్లు కెరియర్ పిక్స్ లో వెళ్తున్నప్పుడే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. కొందరు పెళ్లయిన తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేస్తే, మరికొందరు మాత్రం పెళ్లి తర్వాత కూడా అదే జోరును మెయింటెన్ చేస్తూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాగే హీరోయిన్ మీనా కూడా కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే విద్యాసాగర్ అనే ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. మూడేళ్ల కిందట మీనా కుటుంబంలో పెను విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యంతో ఆమె భర్త చనిపోయారు. అయితే భర్త చనిపోయిన కొన్ని రోజులకే తాను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు వార్తలు రావడం పై ఆమె ఆవేదన చెందినట్లు ఓ టీవీ షోలో కన్నీళ్లు తెప్పించే స్టోరీని బయటపెట్టేసింది.

Also Read : మంగళవారం టీవీల్లోకి మైండ్ బ్లాక్ అయ్యే సినిమాలు.. డోంట్ మిస్..


రెండో పెళ్లి పై మీనా షాకింగ్ కామెంట్స్..

సినీ నటి మీనా తాజాగా సీనియర్ నటుడు జగపతిబాబు నిర్వహిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ టాక్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి వచ్చిన వార్తలు స్పందించి కన్నీళ్లు పెట్టుకుంది. ఆయన మరణించాకా రెండేళ్లు చాలా చాలా కష్టంగా గడిచాయి. ఎంతో బాధను అనుభవించాను. అందులో నుంచి బయటపడడం పెద్ద టాస్క్. నిజంగా అలాంటప్పుడు మన పక్కన ఉన్న స్నేహితులే చాలా గొప్పవారు.. నాకు నా స్నేహితులు చాలా సపోర్ట్ చేశారు నేను చాలా అదృష్టవంతురాలిని మీనా అన్నారు. నా భర్త చనిపోయి వారం కూడా కాలేదు. అప్పుడే అసలు ఏమైందో అని నేనే చాలా షాక్ లో ఉన్నా. న్యూస్ లో చూస్తే మీనా రెండో పెళ్లి చేసుకుంటుందని రూమర్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక నిజం అని ఇంతవరకు అనుకున్నాను కానీ ఇలాంటి వార్తలు కూడా రాసి అవతలి వాళ్ళ మనసు బాధ పెడతారని అనుకోలేదంటూ మీనా మీడియాపై ఒకంత కోపంతో ఊగిపోయారు. మొత్తానికి అయితే రెండు పెళ్లి చేసుకునే ఆలోచన లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఈమె తన సినిమాలపై మాత్రమే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.. సీనియర్ హీరోల సరసన జోడిగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Related News

Jr NTR: సినిమా కోసం ఎన్టీఆర్ నన్ను బ్లాక్ మెయిల్ చేశాడు… డైరెక్టర్ సంచలన ఆరోపణ

Film industry: ఛాన్స్ అంటూ నటిపై అత్యాచారం… ప్రొడ్యూసర్ అరెస్ట్!

OG Guns N Roses Song : గన్స్ అండ్ రోజెస్ వచ్చేసింది… ఇది నెత్తుటి చీత

Suman Shetty : కృష్ణ భగవాన్ అలాంటోడు.. అందుకే ఆయనతో గొడవ

Pawan Kalyan : వీడు పవన్ కళ్యాణ్ కు ఫ్రెండ్ కాదు ఫ్రాడ్, ఆ రచయితపై సోషల్ మీడియాలో మండిపాటు

Lady oriented Movies : టాప్ 5 లేడీ ఓరియెంటెడ్ మూవీస్… మీ ఫేవరెట్ సినిమా ఉందా ?

Upendra: హీరో భార్య ఫోన్ హ్యాక్.. డబ్బులు పంపించాలని డిమాండ్

Big Stories

×