IND Vs PAK : ఆసియా కప్ 2025 సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ ఇప్పటివరకు 8 మ్యాచ్ లు జరిగాయి. కానీ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కి ఉన్నంత క్రేజ్ ఏ మ్యాచ్ కి కూడా లేదు. దీంతో ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. టీమిండియా కెప్టెన్ ఆసియా కప్ 2025 ప్రారంభం కాకముందు పాకిస్తానీయులకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. అయితే ఆ షేక్ హ్యాండ్ ను ఉద్దేశించి దొంగచాటున షేక్ హ్యాండ్ ఇచ్చి.. ఇప్పుడు టీమిండియా కెప్టెన్ నీతులు చెబుతున్నాడని కొంత మంది ఫ్యాన్స్ సూర్య పై సీరియస్ అవుతున్నారు.
Also Read : Asia cup 2025 : ఉంటే ఉండండి.. పోతే వెళ్లిపోండి.. షేక్ హ్యాండ్ వివాదంపై పాకిస్తాన్ పై ఐసీసీ సీరియస్
ముఖ్యంగా భారత్ లోని పహల్గామ్ లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. అయితే దానికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ జరిపింది.పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ తరువాత తొలిసారిగా పాకిస్తాన్ తో ఆసియా కప్ లో తలపడనుంది టీమిండియా. దీంతో ఈ మ్యాచ్ పై హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తో పాటు కొంత మంది ఆటగాళ్లు, పాకిస్తాన్ మంత్రి మొహ్సిన్ నఖ్వీతో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేశారు. దీంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తులు తమ ముఖాలను అద్దంలో ఎలా చూస్తారో తెలియదు. పాకిస్తాన్ వారు భారత్ కి చెందిన అమాయక ప్రజలను చంపుతారు. దుబాయ్ లో మళ్లీ వారితో భారతీయులు కరచలనం చేస్తున్నారని సూర్యకుమార్ యాదవ్ కి స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు నెటిజన్లు.
మరోవైపు మ్యాచ్ ముగిసిన అనంతరం సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లారు. అయితే అక్కడ డ్రెస్సింగ్ రూమ్ కి భారత్ డోర్లు వేసుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని భారత సైన్యానికి అంకితం చేశాడు. అంతేకాకుండా పహల్గామ్ బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నాడు సూర్యకుమార్ యాదవ్. “మేము పహల్గామ్ బాధితులకు అండగా ఉంటాం. మరో ముఖ్యమైన విషయమేంటంటే.. ఈ విజయాన్ని మేము భారత సైన్యానికి అంకితం చేస్తున్నాం. వారు మనల్ని ఎల్లప్పుడూ ఇన్ స్పైర్ చేస్తారని భావిస్తున్నా” అంటూ తన ప్రసంగాన్ని ముగించేశాడు. టీమిండియా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం నిబంధనలకు విరుద్ధమని ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీ యాండీ పైక్రాప్ట్ ను తొలగించాలని, లేకపోతే యూఏఈతో మ్యాచ్ ఆడమని పాక్ బెదిరించింది. అయితే పాక్ బెదిరింపులను ఐసీసీ తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఎంసీసీ మ్యాన్ వల్ లో ఏమి లేదని ఐసీసీ చెప్పినట్టు సమాచారం. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా పాకిస్తాన్ పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఫలితం కంటే ఎక్కువగా షేక్ హ్యాండ్ వివాదం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారడం విశేషం.