Jr NTR Plays Key Role in Kantara: మ్యాన్ ఆప్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2, డ్రాగన్ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఆయన బాలీవుడ్ డెబ్యూ చిత్రం వార్ 2 కొన్ని రోజుల్లో రిలీజ్ కానుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత తారక్ మార్కెట్ భారీగా పెరిగింది. ఈ చిత్రంలో ఇతర భాషల్లోనూ నటిస్తూ తన మార్కెట్ పెంచుకుంటున్నాడు. వార్ 2తో ఇప్పటికే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేసాడు. ఇక త్వరలోనే శాండల్ వుడ్ లో అడుగుపెట్టేందుకు సిద్ధమౌతున్నాడట. ఇంతక అదే సినిమా.. కన్నడ ఎంట్రీ ఎప్పుడనేది ఈ ఆర్టికల్లో చదవివేయండి.
హ్యాష్ ట్యాగ్ తో ఫ్యాన్స్ వార్
గతకొన్ని రోజులు ఎన్టీఆర్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వార్ 2 ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఆయన లుక్పై చర్చిస్తున్నారు. మా హీరో లుక్ బాగుదంటే.. మా హీరో లుక్ బాగుందని ఫ్యాన్స్ వార్ కి దిగుతున్నారు. స్క్రీన్ పై మా హీరోదే డామినేషన్ అంటూ మురిసిపోతున్నారు. అంతేకాదు ఇద్దరి హీరో ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్స్‌తో రెచ్చిపోతున్నారు. ఆగష్టు 14న తర్వాత ఈ వార్ ఎంతవరు దారి తీస్తుందో తెలియడం లేదు.
కాంతార 3లో తారక్?
కానీ, అభిమానుల మధ్య ఈ వార్ మాత్రం గందగోళానికి గురి చేస్తోంది. ఇది వారి పనేనా.. లేక పనిగట్టుకొని ఎవరైనా చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్టీఆర్ గురించిన ఓ క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందో. వార్ 2 తర్వాత ఆయన కన్నడ ఇండస్ట్రీపై దృష్టి పెట్టబోతున్నారట. కాంతార 3 తారక్ రోల్ ముఖ్యపాత్ర పోషించబోతున్నాడు. ఆ మూవీ దర్శకుడు రిషబ్ శెట్టి, ఎన్టీఆర్ కి మంచి సన్నిహితం ఉంది.
పునీత్, రిషబ్ లతో మంచి అనుబంధం
అదే అనుబంధంతో తారక్ కోసం కాంతార 3లో స్పెషల్ రోల్ డిజైన్ చేశాడ. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక తారక్కు కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు కన్నడ భాష కూడా బాగా తెలుసు. దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్‌తో మంచి అనుబంధం ఉంది. ఎప్పుడు ఇద్దరి ఒకరిపై ఒకరు అభిమానం చూపించుకునేవారు. పునీత్కి తారక్ అంటే ఎంతో అభిమానం.
దీంతో ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం చూపిస్తారు. పునీత్, రిషబ్ శెట్టితో మాత్రమే కాదు.. కన్నడ పరిశ్రమ ప్రముఖులతో కూడా ఎన్టీఆర్కి మంచి అనుబంధం ఉంది. ఆ ఇండస్ట్రీ తనకు చాలా ప్రత్యేకమని కూడా తారక్ ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. అలాంటి తారక్ శాండల్ వుడ్ ఎంట్రీ అంటే ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఎన్టీఆర్ కన్నడ ప్రజలకు ఇది పండగలాంటి వార్త అని చెప్పాలి.