SJ Surya:కోలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ (Karthik ) హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తమిళంలో సినిమాలు చేస్తూనే.. ఆ చిత్రాలను తెలుగులో డబ్బింగ్ చేస్తూ ఇక్కడ కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే కార్తీక్ నటించిన ఎన్నో చిత్రాలలో సర్దార్ కూడా ఒకటి. మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అలా భారీ అంచనాల మధ్య వచ్చి సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న మరో చిత్రం సర్దార్ 2.
పీ.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో సెప్టెంబర్ 10వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ కూడా బాగా చేపట్టారు.. ఇకపోతే ఈ ప్రమోషన్స్ లో చోటు చేసుకున్న ఒక ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఈవెంట్ లో పాల్గొన్న స్టార్ డైరెక్టర్ అలియాస్ నటుడు ఎస్.జే.సూర్యకు అక్కడి సిబ్బంది తాగడానికి ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు ఇచ్చారు. ఇది గమనించిన సూర్య వెంటనే తనదైన శైలిలో నాకే ప్లాస్టిక్ బాటిల్ ఇస్తావా ? ఈ సర్దార్ కి కూడా ఇదేనా? అంటూ కోపంగా చెబుతూనే నవ్వులు పూయించారు. పక్కనే ఉన్న హీరో కార్తీక్ వెంటనే తన వాటర్ బాటిల్ సూర్యాకి అందించారు.
also read:బిగ్ బాస్ 10.. ఇంట్లోకి వెళ్ళే తొలి కంటెస్టెంట్ ఎవరంటే?
అయితే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా? లేదంటే సినిమా కాన్సెప్ట్ ను ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేశారా? అన్న విషయం తెలియాల్సి ఉంది.సినిమా కాన్సెప్ట్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల ఆరోగ్యం పోతోంది అంటూ తీసిన సర్దార్ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని.. ఇప్పుడు సీక్వెల్ కూడా అదే తరహాలో రాబోతుండడంతో ఈ సంఘటన ఇందుకు తగ్గట్టుగా జరిగింది అంటూ తెగ వైరల్ చేస్తున్నారు. ఇకపోతే సర్దార్ సీక్వెల్ నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది.
ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఆశికా రంగనాథ్, మాళవిక మోహనన్ , రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సి ఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. మొత్తానికైతే కార్తీక్ సర్దార్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు . ఇప్పుడు సీక్వెల్ తో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి అంటూ అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉండడం గమనార్హం. ఈ చిత్రానికి జార్జ్.సి. విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రిన్స్ పిక్చర్స్, ఐవి ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
• Karthi & SJ Suryah – Reel & Real Life always the same. 😂👌🏻
A huge boost for the #Sardar2 team👏🏻#Karthi #SJSurya #PSMithran@Karthi_Offl @iam_SJSuryah @Psmithran pic.twitter.com/svVFa2IQTC
— GV. Sundhar socialist (@gv_sundhar) August 30, 2026