Dancers Association: తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం కీలక మలుపు తిరిగింది. గత కొంత కాలంగా డాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యం వివాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా యూనియన్ డాన్సర్లు కీలక సమావేశంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే
అసోసియేషన్‌లోని మెజారిటీ సభ్యులు ప్రస్తుత ప్రెసిడెంట్ సుమలత కార్యవర్గంపై అసంతృప్తితో తిరుగుబాటు చేసి, ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్(Raghu Master)ను టెంపరరీ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కీలక బేటీ అనంతరం రఘు మాస్టర్ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ అసోసియేషన్ ప్రయోజనాలు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రఘు మాస్టర్ మాట్లాడుతూ తాను 1997 నుంచి ఈ అసోసియేషన్ లో మెంబర్ గా ఉన్నానని తెలిపారు. దాసరి గారు లాంటి పెద్దవాళ్లు అందరూ కలిసి ఇండస్ట్రీలో ఒక్కొక్క క్రాఫ్ట్ ను అభివృద్ధి చేస్తూ చిత్ర పరిశ్రమను స్థాయికి తీసుకొచ్చారు. ప్రతి ఒక్క అసోసియేషన్ లో కూడా ప్రతిపక్షం అనేది ఉంటుంది ఫెడరేషన్ సహాయ సహకారాలు లేవు అన్నప్పుడే ప్రెసిడెంట్ నుంచి సమాధానం కోసం డాన్సర్స్ అందరూ ఎదురు చూసామని తెలిపారు.
ఫెడరేషన్ లో సభ్యత్వం ఉంటేనే మనకంటూ ఒక విలువ ఉంటుంది. మనకంటూ ఒక హెడ్ కూడా ఉండాలి. ఇది ఒక రూల్ 24 క్రాఫ్ట్ ఫెడరేషన్ ఏదైతే ఉందో టోటల్ ఇండియా లో ఉన్న ఫెడరేషన్ అన్నింటికీ కూడా ఒక హెడ్ ఉంటుంది. వేతనాలు ఇతర సమస్యలకు సంబంధించి మాట్లాడాలి అంటే ఫెడరేషన్ ద్వారానే నిర్మాతలను సంప్రదించాలి. ఇక్కడ డాన్సర్లకు సెక్యూరిటీ ఉంటుందనే ఒక ఉద్దేశంతోనే అందరూ డాన్సర్ అసోసియేషన్ లో జాయిన్ అయ్యారనీ రఘు మాస్టర్ తెలిపారు.
ఇక ఫెడరేషన్ ఎన్నికల గురించి కూడా రఘు మాస్టర్ మాట్లాడుతూ అందరం ఫెడరేషన్ లోకి వెళ్లిన తర్వాత మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించాలని అప్పుడు కూడా సుమలత పోటీ చేయవచ్చని తెలిపారు. ఇక్కడ గొడవలు ఏమీ లేవు అందరికీ ఒకే విధమైన రూల్ ఉంటుందని తెలిపారు. మినిట్స్ బుక్ లోకి డాన్సర్స్ అందరూ సంతకాలు చేసి ఇస్తే అవి ఫెడరేషన్ కి ఇచ్చిన వెంటనే ఎన్నికల కు వెళ్దామని రఘు మాస్టర్ తెలిపారు. ఫెడరేషన్ అండదండలతోనే అసోసియేషన్ ఎన్నికలు జరగాలని తెలిపారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ అడ్డుకోలుగా వ్యవహరిస్తే వారిని ప్రశ్నించే హక్కు డ్యాన్సర్స్ అందరికీ ఉంటుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా అజయ్ మాస్టర్ కూడా మాట్లాడుతూ రఘు ప్రెసిడెంట్ విషయంలో ఈయనకు మద్దతుగా శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారని ఆయన కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మన యూనియన్ కి ప్రాబ్లం వచ్చినప్పుడు రఘు మాస్టర్ ముందుకు వచ్చారని అజయ్ మాస్టర్ తెలిపారు.
Also Read: NBK 112 లో మరో కోలీవుడ్ స్టార్..కొరటాల క్రేజీ ప్లాన్!