TVK Vijay:ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay thalapathy) ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు టీవీకే అనే పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. మరికొన్ని రోజుల్లో తమిళనాడులో జరగబోయే ఎన్నికలలో తన పార్టీ తరఫున పోటీ చేసి అధికారంలోకి రావాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే ఇప్పటికే పలు బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ప్రసంగిస్తున్నారు. అంతేకాదు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలా ఉపయోగపడతాము అనే విషయంపై కూడా చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం . ఇదిలా ఉండగా రాజకీయాలలోకి వెళ్లే ముందు చివరి సినిమాగా విజయ్ నటిస్తున్న చిత్రం జననాయగన్.
జనవరి 9వ తేదీన ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా..ఇందులో ఉన్న కొన్ని రాజకీయ అంశాలు చర్చకు దారితీస్తాయనే నేపథ్యంలోనే ఈ సినిమాకి సెన్సార్ రాలేదు. అలా సెన్సార్ కారణంగా అటు సెన్సార్ సభ్యులకు ఇటు చిత్ర నిర్మాతలకు జరిగిన న్యాయ పోరాటం అందరికీ తెలిసిందే..దీంతో దిగివచ్చిన నిర్మాతలు సెన్సార్ కమిటీ పై వేసిన కేసును విరమించుకుంటూ మళ్లీ రివైజింగ్ కమిటీకి తమ సినిమాను పంపిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సమస్య సద్దుమణిగింది త్వరలోనే రిలీజ్ చేస్తారని అనుకోగా.. ఇప్పుడు మరో షాక్ తగిలినట్లు తెలుస్తోంది.. తాజాగా యార్క్ సినిమాస్ తన తాజా ప్రకటనలో ..”ప్రియమైన ప్రేక్షకులారా.. జననాయగన్ సినిమా ఏప్రిల్ 30వ తేదీ విడుదల కాదు అని గమనించగలరు. టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిఫండ్ కోసం థియేటర్లను సంప్రదించవచ్చు” అంటూ స్పష్టం చేసింది. ఇక దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ చివరిలో లేదా మే నెలలో వచ్చే అవకాశం కనిపించకపోవడం గమనార్హం.
ఇకపోతే ఈ ప్రకటనతో అందరికీ అర్థమయ్యే విషయం ఏమిటంటే.. 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది.. విజయ్ తన సొంత పార్టీని స్థాపించిన తర్వాత వస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రం ఎన్నికల ప్రచారానికి ప్లస్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ కోర్టు వివాదాలు, సెన్సార్ చిక్కుల వల్ల ఈ సినిమా ఎన్నికల తర్వాతే విడుదల కానుంది. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే రివైజింగ్ కమిటీకి పంపారు . అక్కడ క్లియరెన్స్ వస్తేనే కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే కెనడా డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిన అప్డేట్ చూస్తుంటే ఇతర దేశాలలో కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని అటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తూ ఉండగా, మమితాబైజు కీలక పాత్ర పోషిస్తుంది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇది చూసిన ఆడియన్స్ విజయ్ మూవీకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ:Dhurandhar: పైరసీలో కూడా దుమ్ము దులిపేస్తున్న ధురంధర్!