Indian Cinima:పైరసీ.. భూతంలా సినీ ఇండస్ట్రీని పట్టుకుని పీడుస్తోంది. అసలే సినిమా ఇండస్ట్రీ భారీ కష్టాల్లో మునిగి తేలుతున్న ఇలాంటి సమయంలో.. మళ్లీ ఈ పైరసీ సినీ ఇండస్ట్రీని మరింత దారుణ పరిస్థితుల్లోకి నెట్టి వేస్తోందని చెప్పవచ్చు. అసలే థియేటర్ కి ప్రేక్షకులు వచ్చి సినిమా చూడలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు కంటెంట్ బాగున్నా కూడా ఒక్కొక్కసారి కలెక్షన్లు రావడం లేదు. దీంతో చేసేదేమీ లేక సినీ పెద్దలు తలలు పట్టుకుంటున్న వేళ.. ఇప్పుడు ఈ పైరసీ భూతం వారిని మరింత అగాధంలోకి నెట్టివేస్తోంది.
ఇక అందుకే ఈ పైరసీ ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి పెద్ద యుద్ధం ప్రకటించింది సినీ పరిశ్రమ. ఇలా మేలుకోవడం ఇదేమి మొదటిసారి కాకపోయినప్పటికీ.. ఇప్పుడు మాత్రం ఈ విషయం చాలా సీరియస్ గా తీసుకున్నారు చెప్పవచ్చు.
పైరసీ భూతం.. ఏటా ఇండస్ట్రీకి ఎన్ని వేల కోట్ల నష్టమంటే?
పైరసీ వల్ల ప్రతి యేటా రూ.22 వేల కోట్ల మేర ఇండియన్ సినిమా నష్టపోతోంది. నెలకు రూ.40,000 నుండీ రూ.80 వేలు వస్తాయని కక్కుర్తి పడి వందల కోట్ల సినిమాను బలి తీసుకుంటారా? ఊరూరా సీక్రెట్ కెమెరాలతో మాటు వేసిన పైరసీ గాళ్లు.. వాళ్లతో కుమ్మక్కయ్యే థియేటర్ యజమానులు.. సినిమా పరిశ్రమను పీడించే పైరసీ క్యాన్సర్ కు కారణం ఇంటి దొంగ లేనా అని అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. థియేటర్లలో మార్నింగ్ షో పడిందంటే చాలు.. మన హోమ్ థియేటర్లన్నీ మాట్నీ షోకి రెడీ అవుతున్నాయి. సేమ్ మూవీ.. సేమ్ క్వాలిటీ.. కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.. టికెట్ ప్రైస్ తో సంబంధం లేదు.. బుకింగ్ కోసం క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరమే లేదు. ఆన్లైన్లో అవైలబిలిటీ కోసం చూసే ప్రసక్తే లేదు. ₹100 ఖర్చు లేకుండా కొత్త సినిమాను ఎంజాయ్ చేస్తున్న వాళ్లు కూడా మన మధ్యలోనే ఉన్నాయి. సినిమా చూసే వాళ్లకు మిగిలేది రూ.300 అయినా తీసే వాళ్లకు మాత్రం కోట్లల్లో నష్టం.
కేటుగాడిని పట్టుకున్న పోలీసులు..
మొత్తం 24 విభాగాలలో ఎక్స్పర్ట్స్ తమ మేధస్సును పెట్టుబడిగా పెట్టి.. అత్యంత శ్రమకు ఓడ్చి ఒక సినిమా తీస్తే ఇప్పుడు ఇది కాస్తా పైరసీ గాళ్ల చేతి వాటానికి దొరికి.. మొత్తానికి సినిమా పరిశ్రమ కి దెబ్బ పడింది. కారణం జానా కిరణ్ కుమార్.. ఈ ఒక్క వ్యక్తి వల్ల 50కి పైగా సినిమాలను దొంగలించి పైరసీలో అమ్మేశాడు. ఇటీవలే ఈ చోర గాడిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వెలుగులోకి దిమ్మ తిరిగి విషయాలు..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. శ్రీవిష్ణు #సింగిల్ సినిమా హెచ్డి ప్రింట్.. సినిమా రిలీజ్ అయిన రోజు మధ్యాహ్నానికి మూవీ రూల్జ్ , తమిళ్ బ్లాస్టర్స్ , తమిళ్ ఎం వి వంటి మూడు పైరసీ సైట్లల్లో దర్శనం ఇవ్వడంతో.. వెంటనే అలెర్ట్ అయిన గీతా ఆర్ట్స్ ఫిలిం ఛాంబర్ లోని యాంటీ పైరసీ సెల్ కి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా కదిలి.. అత్తాపూర్ లోని సినీ పోలీస్ లు మ్యాట్నీ షో కి టికెట్ బుక్ చేసుకున్న కిరణ్ పై అనుమానం వచ్చి ఫోన్ చేయగా.. స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యారు. ఇక ఈసారి మాత్రం ఇంటి లొకేషన్ ను గుర్తించి పక్కా ప్లానింగ్ తో వేటాడి మరీ తనిఖీ చేసి కిరణ్ ని అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా అతడి ఫోన్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి.. వాటర్ మార్కింగ్ పరిశీలిస్తే.. ఇది ఏ ఫలానా థియేటర్ నుంచి లీకైన కంటెంట్ అని తేలిపోయింది. మూడు రోజులపాటు విచారించిన పోలీసులు ఇప్పటివరకు 65 సినిమాల కంటెంట్ ను చోరీ చేసినట్లు గుర్తించారు. ప్రతి నెల రూ.80 వేల వరకు ఒక్కో సినిమాకు వెనకేసుకున్నట్లు ఒప్పుకున్నాడు. పైరసీ కారణంగా రూ.3700 కోట్లు ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రాథమిక అంచనా వేసినా.. దీనివల్ల ప్రతి యేట రూ.22,400 కోట్లు ఇండియన్ సినిమా నష్టపోయినట్లు సమాచారం.