BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై ఇప్పుడు లీగల్ ఫైట్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ జీవోపై స్టే విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. దానిని విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించింది ఉన్నత న్యాయస్థానం.
హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని ప్రశ్న..
హైకోర్టులో విచారణ జరుగుతుండగా.. సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని పిటిషన్‌ను ప్రశ్నించింది కోర్టు. హైకోర్టులో స్టే ఇవ్వకపోవడంతో ఇక్కడికి వచ్చామని పిటిషనర్ తెలిపారు. కానీ ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో విచారణ జరుగుతుందని తెలిపింది.
ఈ నెల 8న హైకోర్టులో జరగనున్న విచారణ..
మరోవైపు ఈ నెల 8న తెలంగాణ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. ఇప్పటికే ప్రభుత్వానికి పలు కీలక ప్రశ్నలను సంధించింది హైకోర్టు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కోర్టు తెలిపింది. కోర్టుల జోక్యం ఉండకూడదంటే.. 10 రోజులు వాయిదా వేసుకోవాలని హైకోర్టు సూచించింది. ఆ తర్వాత విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
రిజర్వేషన్లకు మద్దతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు
విచారణకు కౌంట్‌డౌన్ కొనసాగుతున్న సమయంలోనే ప్రభుత్వం ప్రతిపాదించిన బీసీ రిజర్వేషన్లకు మద్ధతుగా హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ నేత వీహెచ్, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య, మాజీ ఐఏఎస్ చిరంజీవులు వీటిని ఫైల్ చేశారు. తమ వాదనలూ వినాలని కోరుతూ ఇంప్లీడ్ పిటిషన్లు వేశారు. వీటన్నింటినీ హైకోర్టు విచారించనుంది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్
ఇప్పటికే ఎస్సీ, ఎస్టీలకు 27శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. వీటికి 42 శాతం బీసీ రిజర్వేషన్లు కలిపితే 69 శాతం రిజర్వేషన్లు అవుతాయి. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే ఇప్పుడు చిక్కుముడిగా మారింది. కానీ తెలంగాణ ప్రభుత్వం అయితే ఓ విషయంలో బిగ్ రిలీఫ్ పొందినట్టే అయ్యింది.
Also Read: KGHలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన హోమ్ మంత్రి అనితా
ఇప్పటికే హైకోర్టులో లీగల్ ఫైట్ చేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా న్యాయపోరాటం చేయాల్సిన అవసరం అయితే తప్పింది. మరి ఈ నెల 8న హైకోర్టు విచారణలో ఏం జరగనుంది అనే దానిపైనే స్థానిక సంస్థల భవితవ్యం ఆధారపడి ఉంది.
బీసీ రిజర్వేషన్ల విషయంలో ఈనెల 8న తెలంగాణ హైకోర్టు ఇవ్వబోయే తీర్పు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా
వస్తుందని ఆశిస్తున్నాం. బీసీ వర్గాలకు జనాభా తగ్గట్టు పదవులు ఇవ్వాలి అని సీఎం రేవంత్ పని చేస్తున్నాడు. హైకోర్టు తీర్పు రాగానే ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు ఎన్నికలు జరుగుతాయి— BIG TV Breaking News (@bigtvtelugu) October 6, 2025