Janhvi Kapoor:దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్(Janhvi kapoor). తల్లికి తగ్గ అందంతో.. నటనతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు టాలీవుడ్ లో ఎన్టీఆర్(NTR ) హీరోగా నటించిన దేవర (Devara) సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నా.. మరొకవైపు నాని సినిమాలో కూడా అవకాశం అందుకున్నట్లు సమాచారం. ఇలా ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూనే.. అటు బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.
అరుదైన గౌరవాన్ని అందుకున్న జాన్వీ కపూర్ మూవీ..
అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో ‘ధడక్’ అనే సినిమాలో ప్రేమికులుగా కనిపించి.. మంచి విజయాన్ని అందుకున్నారు. జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్(Ishan Khattar). ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న చిత్రం హోమ్ బౌండ్(Home Bound). నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందరి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు మరో మైలురాయిని చేరుకోబోతోంది. టొరెంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ – 2025 వేడుకల్లో ప్రదర్శించడానికి ఈ సినిమాను ఎంపిక చేశారు. గాలా ప్రజెంటేషన్ విభాగంలో అధికారికంగా ఎంపికైనట్లు చిత్ర బృందం తెలిపింది.
హర్షం వ్యక్తం చేస్తున్న చిత్ర బృందం..
అయితే ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. తమ చిత్రం ఈ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడానికి ఎంపికైనందుకు చాలా గర్వంగా ఉంది అంటూ తెలిపింది. అయితే ఇందుకు సంబంధించిన పోస్టర్ ను జాన్వి కపూర్ కూడా షేర్ చేసింది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ నామినేషన్స్ లో కూడా చోటు దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది మే లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2025 లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ వేదికపై మూవీకి ప్రత్యేకమైన ప్రశంసలు లభించగా.. సినిమా ప్రదర్శన పూర్తయిన వెంటనే అతిధులు దాదాపు తొమ్మిది నిమిషాల పాటు నిల్చొని చప్పట్లు కొడుతూ చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
హోమ్ బౌండ్ సినిమా స్టోరీ..
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే .. ఇద్దరూ బాల్య స్నేహితులు.. యువకులుగా మారిన తర్వాత పోలీసు ఉద్యోగం సాధించాలనుకుంటారు. లక్ష్యానికి దగ్గరగా వెళ్లే కొద్దీ ఈ ఇద్దరి ప్రాణ స్నేహితుల మధ్య దూరం పెరుగుతుంది. ఆ దూరం ఎందుకు పెరిగింది అనే అంశంపైనే ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ చిత్రం విడుదల కోసం యావత్ దేశ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికే ఎన్నో గౌరవాలు అందుకుంటున్న ఈ సినిమా విడుదలయ్యాక ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
also read:Bigg Boss 9: బిగ్ బాస్ హౌస్లో సరికొత్త రూల్స్.. వర్కౌట్ అవుతుందా?