Devara Satellite Rights: సాధారణంగా ఏదైనా ఒక సినిమా విడుదలకు ముందే ఆ సినిమాకు సంబంధించి ఆడియో రైట్స్ నుంచి మొదలుకొని.. సాటిలైట్, థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రైట్స్ అమ్ముడుపోతూ ఉంటాయి. ఇలా విడుదలకు ముందే సినిమాలో భారీ స్థాయిలో బిజినెస్ లను జరుపుకుంటూ ఉంటాయి. అయితే స్టార్ హీరోల సినిమాలకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో భారీ పోటీ ఉంటుందని సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ సినిమా విషయంలో మాత్రం విభిన్నమని చెప్పాలి. ఈయన కొరటాల శివ(కే Koratala siva) దర్శకత్వంలో నటించిన దేవర సినిమా(Devara Movie) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది.
ఇలా ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి వందల కోట్ల కలెక్షన్లను రాబట్టింది అదేవిధంగా డిజిటల్ మీడియాలో కూడా ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది . ఇక ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు కానీ ఇప్పటివరకు టెలివిజన్ లో ప్రసారం కాలేదు. ఇలా ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కాకపోవడానికి కారణం ఈ సినిమా సాటిలైట్ హక్కులు అమ్ముడు పోకపోవటమే కారణం. ఎన్టీఆర్ లాంటి పాన్ ఇండియా స్టార్ హీరో సినిమాకు సాటిలైట్ హక్కులు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం అని చెప్పాలి.
ఇలా ఈ సినిమా విడుదలైన రెండు సంవత్సరాలకు సాటిలైట్ హక్కులకు మోక్షం కలిగిందని తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమా శాటిలైట్ హక్కులు భారీ ధరలకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది. మరి ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఏ ఛానల్ దక్కించుకున్నారు అనే విషయానికి వస్తే.. ఇప్పటివరకు తెలుగులో ఎన్నో చానల్స్ ఉన్నప్పటికీ ఏ తెలుగు ఛానల్ కూడా ఈ సినిమా సాటిలైట్ రైట్స్ కోసం ముందుకు రాలేదని తెలుస్తుంది అయితే త్వరలోనే తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్న సోనీ తెలుగు (Sony Telugu) దేవర సినిమా సాటిలైట్ హక్కులను కైవసం చేసుకున్నారు .
ఇలా తెలుగులో లాంచ్ అవ్వబోతున్న ఒక టీవీ ఛానల్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రారంభం కావడం విశేషం. ఇక ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా టెలివిజన్ ప్రీమియర్ కి సంబంధించి అధికారక ప్రకటన వెల్లడించనున్నారు. ఇక ఎన్టీఆర్ దేవర సినిమా తర్వాత ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2027 జూన్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.
Also Read: బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40 కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!