Dimple Hayathi -Sharwanand: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న శర్వానంద్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ ఏడాదిలో రెండు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్(Sharwanand) రెండు సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన త్వరలోనే భోగి(bhogi) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా నవంబర్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల వాయిదా పడుతూ నవంబర్ 27వ తేదీ విడుదలకు సిద్ధమయింది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్రబృందం ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొనే సందడి చేశారు. అయితే ఈ వేడుకలు నటి డింపుల్ హయతి (Dimple Hayathi )స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఎరుపు రంగు చీరలో ఎంత చూడముచ్చటగా ఉన్న డింపుల్ కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ ఈవెంట్లో డింపుల్ హయతి శర్వానంద్ తో చాలా చనువుగా కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
శర్వానంద్ ను చూడగానే ఒక్కసారిగా ఆయనని హగ్ చేసుకున్న ఈమె తన పక్కనే కూర్చుని శర్వానంద్ భుజంపై తలవాల్చుతూ సేద తీరుతూ కాస్త క్లోజ్ గా కనిపించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వీరిద్దరికి సంబంధించి ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారా? పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఈ వీడియోలపై కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే శర్వానంద్ రక్షిత రెడ్డి(Rakshitha) అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉన్న సంగతి తెలిసిందే.
#Sharwanand & #DimpleHayathi #Bhogi Pre Release event! pic.twitter.com/Yb1FEXHUYV
— AnantapurBO (@AnantapurBO) November 23, 2026
ఇలా శర్వానంద్ కి కూతురు ఉన్నప్పటికీ తన భార్య రక్షితతో వచ్చిన విభేదాలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ తమ విడాకులను అధికారకంగా ప్రకటించలేదు అలాగే విడాకుల రూమర్లపై కూడా శర్వానంద్ ఎక్కడ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే డింపుల్ హయతి తో రిలేషన్ గురించి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ వార్తలను మరికొందరు కొట్టి పారేస్తున్నారు. ఈ సినిమాలో నటించడం వల్ల ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉండడంతో ఇలా క్లోజ్ గా ఉండొచ్చు కదా.. క్లోజ్ గా ఉంటే రిలేషన్ లో ఉన్నట్టేనా అంటూ ఈ వీడియో పట్ల స్పందిస్తున్నారు. మరి ఈ వీడియోలపై డింపుల్ లేదా శర్వా స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: నాగచైతన్య బర్త్ డే.. లిప్ లాక్ తో శోభిత స్పెషల్ విషెస్!