E-Paper
Advertisement

దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!

దుప్పటి కింద ఫోన్ పెట్టి ఛార్జ్ చేస్తున్నారా? వింటర్ సీజన్లో ఈ అలవాటు ఎంత ప్రమాదమో తెలుసా!
Advertisement

Smartphone Charging Mistakes: చలికాలం మొదలవగానే మన ఆరోగ్యంతో పాటు మనం రోజూ వాడే స్మార్ట్‌ఫోన్‌ల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే.. ఈ సీజన్‌లో ఫోన్ బ్యాటరీ సమస్యలు చాలా ఎక్కువగా వస్తుంటాయి. బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గిపోవడమే కాకుండా, బ్యాటరీ లైఫ్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే శీతాకాలంలో ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనం తెలిసో తెలియకో చేసే కొన్ని సాధారణ పొరపాట్లను అస్సలు చేయకూడదు. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మరీ చల్లగా ఉన్న చోట ఛార్జింగ్ వద్దు:

ప్రస్తుతం వస్తున్న స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో లిథియం-అయాన్ బ్యాటరీలు ఉంటాయి. వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు ఈ బ్యాటరీ లోపల జరిగే రసాయన ప్రక్రియ బాగా నెమ్మదిస్తుంది. దీనివల్ల ఛార్జింగ్ ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. మీరు బయట చలిలో ఎక్కువసేపు గడిపి ఇంటికి రాగానే.. ఫోన్‌ను వెంటనే ఛార్జింగ్ పెట్టకండి. ఇలా చేయడం వల్ల బ్యాటరీపై విపరీతమైన ఒత్తిడి పడి శాశ్వతంగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫోన్ సాధారణ గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే ఛార్జింగ్ పెట్టడం మంచిది.

రూమ్ హీటర్ల దగ్గర పెట్టకూడదు:

Advertisement

చలి నుంచి ఫోన్‌ను కాపాడటానికి లేదా ఛార్జింగ్ త్వరగా ఎక్కాలనే ఉద్దేశంతో కొందరు ఫోన్‌ను రూమ్ హీటర్లు, బ్లోయర్ల పక్కన పెట్టి ఛార్జ్ చేస్తుంటారు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఒక్కసారిగా తగిలే ఈ అధిక వేడి వల్ల ఫోన్ బ్యాటరీ హెల్త్ పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ గాలి బాగా ఆడే సాధారణ ప్రదేశంలోనే ఫోన్‌ను ఛార్జ్ చేయాలి.

Also Read: కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

దుప్పటి కింద పెట్టి ఛార్జ్ చేయొద్దు:

Advertisement

చలికాలంలో మనం దుప్పటి కప్పుకుని ఫోన్ వాడుతూ.. అలాగే దిండు కింద లేదా దుప్పటి లోపల ఫోన్ పెట్టి ఛార్జింగ్ వదిలేస్తుంటాం. ఇలా చేయడం వల్ల ఛార్జింగ్ సమయంలో ఫోన్ నుంచి వచ్చే వేడి బయటకు వెళ్లే దారి లేక లోపలే ఉండిపోతుంది. దీనివల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కి బ్యాటరీ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది.

ఒరిజినల్ ఛార్జర్ మాత్రమే వాడాలి:

బ్యాటరీ సురక్షితంగా ఉండాలంటే.. ఎల్లప్పుడూ కంపెనీ ఇచ్చిన ఒరిజినల్ ఛార్జర్, కేబుల్ మాత్రమే వాడాలి. తక్కువ ధరకు వస్తున్నాయని లోకల్ ఛార్జర్లు వాడితే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. అలాగే ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్‌ను అనవసరంగా వాడకపోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.

Also Read: iPhone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

Tags

Related News

కేవలం రూ.349కే అన్‌లిమిటెడ్ 5G డేటా, 1+1 రీఛార్జ్.. ఇంతకంటే బెస్ట్ ప్లాన్ ఇంకేముంటుంది?

బడ్జెట్ ధరలో ఫ్యామిలీ సైజ్ ఎయిర్ ఫ్రయర్ కావాలా?రూ.2,999కే సూపర్ డీల్!

రూ.899కే 50 గంటల బ్యాటరీ!ఫైర్-బోల్ట్ ఏరో ప్రో ఇయర్‌బడ్స్ ఫీచర్లు అదుర్స్

iPhone 17 కొనేవారికి పండగే.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే ఆఫర్, క్రెడిట్ కార్డ్ లేకపోయినా భారీ తగ్గింపు!

జియో యూజర్లు ఎగిరి గంతేసే ప్లాన్.. రూ.1000 రీఛార్జ్ చేస్తే రూ.1000 వోచర్లు, ఏడాది పాటు Canva Pro ఫ్రీ!

10 నిమిషాల్లో డెలివరీ, రూ.22,000 తగ్గింపు.. Motorola Edge 70 Fusionపై క్రేజీ బ్లాక్ ఫ్రైడే డీల్!

అచ్చం మన పక్కంటి వాళ్లు దారి చెప్పినట్టే చెప్తోంది.. Apple Mapsలో వచ్చిన ఈ 3 కొత్త అప్డేట్స్ చూశారా?

Big Stories

Advertisement
×