Nagavva’s Endi Gajja Song:నాగవ్వ..ఈ పేరిపుడు ఫోక్ ఇండస్ట్రీలో సంచలనం స్ప్రుష్టిస్తుంది.పాట ఏదైనా నాగవ్వే పాడాలి అన్నట్టుగా ఉంది పరిస్థితి.జగిత్యాల (కరీంనగర్)జిల్లా లోని అంబారి పేట కి చెందిన నాగవ్వ బాయిలోనే బల్లి పలికే పాటతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఇక ఈ క్రమంలోనే తాజాగా వైష్ణవీ సోనీ తో కలిసి ”ఎండి గజ్జ” అంటూ మరో పాటతో నెట్టింట్లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ పాట కేవలం నెలరోజుల్లోనే 40లక్షలకి పైగా వ్యూస్ సొంతం చేసుకోవడం విశేషం.
ఇక ఈ పాటకి వనిలా గుజ్జేటి పాటని రాయడమే కాకుండా నాగవ్వతో కలిసి పాడటం ఇక్కడ మరో విశేషం.గతంలో వనిలా గుజ్జేటి ఇలానే ఎన్నో పాటల్ని రాసి పాడింది కూడా. ఇక ఈ ”ఎండి గజ్జ”పాటకి వరుస హిట్స్ అందుకుంటున్న కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అందించగా, ఎప్పటిలాగే శేఖర్ వైరస్ తన స్టెప్పులతో ఫిదా చేశాడు.అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఈ పాటలో వైష్ణవి సోనీ ఎక్స్ప్రెషన్స్ అండ్ స్టెప్పులతో పాటు నాగవ్వ పెక్యులర్ వాయిస్ ఈ పాటకి బాగా కలిసివచ్చిందని చెప్పాలి.
ఈ పాటకి ఒక స్పెషల్ ఎనర్జీ
ఇక ఈ పాటలో వైష్ణవి సోనీ వేసుకున్న కాస్ట్యూమ్స్ అదిరిపోయాయని, స్క్రీన్ ప్రెజన్స్ తో పాటు ఇచ్చిన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయని కొంతమంది అంటే నాగవ్వ కోసమే ఈ పాటని చూస్తున్నామని మరి కొందరు ఆకాశానికి ఎత్తేయడం విశేషం.ఇక నాగవ్వ కనిపించినప్పుడులా ఈ పాటకి ఒక స్పెషల్ ఎనర్జీ వచ్చిందని నెటిజన్లు అనడం బట్టి చూస్తే తన గొంతుతో నాగవ్వ ఎంతగా మెస్మరైజ్ చేసిందో అర్థం అవుతుంది.
ఈ పాటకి మాధురి రాథోడ్ అయితే
అయితే చాలా మంది ఈ పాటకి మాధురి రాథోడ్ అయితే మరింత న్యాయం చేస్తుందని, ఆ జోష్ వైష్ణవి సోనీలో మిస్ అయ్యాయని చెప్పడం గమనార్హం. ముఖ్యంగా మాధురి ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ , ఎనర్జీ , వేసే స్టెప్పులు ఈ మధ్య బాగా ఆడియన్స్ ని అలరిస్తుండటం వల్ల అలాంటి కామెంట్స్ వినిపిస్తున్నాయని తెలుస్తుంది.
ఈ జోడీ ఇంకెన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంటుందో !
ఇక వైష్ణవీ సోనీ విషయానికి వస్తే బాసింగ బాలాలు తో ఫేమస్ అయిన ఈ ఫోక్ డాన్సర్ రీసెంట్ గా నాగవ్వ తోనే ఎద్దులొచ్చే ముద్దులాడే అనే ఫోక్ సాంగ్ తో ఆడియన్స్ ని మెప్పించింది కూడా.మరో వైపు నాగవ్వ కూడా తగ్గేదేలే అంటూ మరిన్ని పాటలతో రచ్చ చేసేందుకు రెడీ అయిపోతుంది.చూడాలి ముందు ముందు ఈ జోడీ ఇంకెన్ని హిట్స్ ఖాతాలో వేసుకుంటుందో !