E-Paper
Advertisement

వాయిదా పడ్డ నితిన్ ‘అలియాస్ రుక్మిణి’.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

వాయిదా పడ్డ నితిన్ ‘అలియాస్ రుక్మిణి’.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?
Advertisement

Alias Rukmini Movie: ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకోవడానికి నితిన్ (Nithin) కష్టాలు పడుతున్నారనే మాటలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక ఇబ్బందులు పడుతున్న నితిన్.. చివరిగా రాబిన్ హుడ్, తమ్ముడు వంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. గత ఏడాది ఈ సినిమాలో ఈయనను మళ్ళీ నిలబెడతాయని ఆడియన్స్ కూడా అనుకున్నారు. కానీ రెండూ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ఇప్పుడు మరో కొత్త కథతో ‘అలియాస్ రుక్మిణి’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

వాయిదా పడ్డ అలియాస్ రుక్మిణి..

యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాని సమర్పిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన ఆఫియా సయ్యద్ హీరోయిన్ గా నటిస్తోంది. మురళీకాంత్ దేవాసోత్ దర్శకత్వంలో తెలుగు రొమాంటిక్ కామెడీ డ్రామాగా రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రెండో రోజుల క్రితం ‘జామ్ పార్టీ’ అంటూ ఒక చిన్న ఈవెంట్ ను కూడా నిర్వహించారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతుంది. డిసెంబర్ 4న థియేటర్లలో సినిమా చూస్తాం అని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు ఇప్పుడు నిరాశే మిగిలింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అలియాస్ రుక్మిణి వాయిదా పడినట్లు తెలుస్తోంది.

కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

Advertisement

అయితే అలియాస్ రుక్మిణీ మూవీ వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నా.. దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కానీ డిసెంబర్ 18వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీని నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనుంది. డిసెంబర్ 4న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వాయిదా పడింది అంటూ వస్తున్న వార్తలు అభిమానులను మరింత నిరాశకు గురి చేస్తున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

నితిన్ తో నాకున్న అనుబంధం ఇదే..

ఇకపోతే ఇటీవల నిర్వహించిన జామ్ పార్టీలో నాని మాట్లాడుతూ.. “ఒకప్పుడు నితిన్ నటించిన అల్లరి బుల్లోడు చిత్రానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. ఇప్పుడు నా సమర్పణలో ఆయన చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. నా ఆరంభంలో ఒక పేజీ నీది.. నీ పునః ప్రారంభంలో ఒక పేజీ నాది” అంటూ నితిన్ తో నాని తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.

నా కెరియర్లో ఉత్తమ చిత్రం..

Advertisement

ఇదే ఈవెంట్లో నితిన్ మాట్లాడుతూ.. “నా కెరియర్ లో ఇదొక ఉత్తమ చిత్రంగా నిలుస్తుంది. ఇందులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని ప్రతి అంశాన్ని కూడా ప్రేక్షకులు ఆస్వాదిస్తారు కదా.. అందరికీ నచ్చుతుంది”అంటూ నితిన్ తెలిపారు. మొత్తానికైతే భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చే ఈ సినిమా ఆడియన్స్ నుండి ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో చూడాలి.

ALSO READ: ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘రికార్డ్’ పోస్టర్!

Related News

నాగచైతన్య బర్త్ డే.. లిప్ లాక్ తో శోభిత స్పెషల్ విషెస్!

ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘రికార్డ్’ పోస్టర్!

కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్.. ENE రిపీట్ తో భారీ క్రేజ్!

MS సుబ్బులక్ష్మి బయోపిక్ కోసం మరో సాహసానికి సిద్ధమైన రష్మిక!

అనిరుద్ కావ్య వెడ్డింగ్ రిసెప్షన్.. ఖర్చు తెలిస్తే దిమ్మ తిరిగి పోవాల్సిందే!

వెంకీ మామ చైతూ పై మీనాక్షి చౌదరి కామెంట్స్.. ఇద్దరిదీ ఒకటే క్యారెక్టర్ అంటూ!

నషాముక్త్ భారత్‌కు ప్రభాస్‌కు కిషన్‌రెడ్డి ఆహ్వానం.. పోస్టర్ ఆవిష్కరణ

Big Stories

Advertisement
×