Vrushakarma: అక్కినేని నాగచైతన్య త్వరలోనే వృషకర్మ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya) జోడిగా మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary) హీరోయిన్ గా సందడి చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుందని తెలుస్తోంది. తాజాగా సినిమా చూసిన సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. వృషకర్మ (Vrushakarma)సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా విడుదలకు ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా సెన్సార్ సభ్యులు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. నాగచైతన్య కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమా విషయంలో నాగచైతన్య ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా మైథాలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమాలో ఈయనకు జోడిగా మీనాక్షి చౌదరి దక్ష అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఈమె పురావస్తు శాఖ శాస్త్రవేత్తగా ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు. నాగచైతన్య ధర్మాన్ని కాపాడే ఒక యోధుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటివరకు లవ్, ఫ్యామిలీ, యాక్షన్ తరహా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగచైతన్య మొదటిసారి ఇలాంటి మైథాలాజికల్ థ్రిల్లర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక నాగచైతన్య చివరిగా తండేల్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది ఈ సినిమా తర్వాత వృషకర్మ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా నాగచైతన్య ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక నాగచైతన్య 25వ సినిమా క్లాక్స్ డైరెక్షన్లో చేయబోతున్నట్టు ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఇక నాగచైతన్య 25వ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ పాత్రలో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.మరి నాగచైతన్య 25వ సినిమాకి సంబంధించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.
Also Read: శర్వా భుజం పై వాలిన డింపుల్.. తెర పైకి కొత్త రూమర్లు?