E-Paper
Advertisement

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!
Advertisement

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా పుష్ప సినిమా( Pushpa) ద్వారా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun)క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈయన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా (Raaka)పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

వందల కోట్ల రెమ్యూనరేషన్..

ఇక బన్నీ సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈయన ఒక్కో సినిమాకు దాదాపు 200 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.. ఇక అల్లు అర్జున్ ఆస్తిపాస్తులు కూడా వేల కోట్లలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన ఎన్నో రకాల బిజినెస్లను కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కి సంబంధించి ఒక న్యూస్ ప్రస్తుతం వైరన్ అవుతుంది. ఈయన సినిమాలు చేయకపోయినా కూడా ప్రతి ఏడాది సుమారు 40 కోట్ల వరకు ఆదాయం అందుకుంటున్నారని సమాచారం.

థియేటర్స్ ద్వారా భారీ ఆదాయం..

Advertisement

ఇలా సినిమాలు లేకపోయినా ఇంత మొత్తంలో ఆదాయం ఎలా వస్తుంది? ఏంటి? అనే విషయానికి వస్తే.. అల్లు అర్జున్ సినిమాలు చేయకపోయినా కేవలం బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ ద్వారా సుమారు 30 కోట్ల వరకు సంపాదిస్తున్నారని తెలుస్తుంది. అదే విధంగా ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు థియేటర్లు ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది ఈ థియేటర్ల ద్వారా 200 కోట్ల రెవెన్యూ టర్నోవర్ అవుతుందని అయితే ఖర్చులు అన్ని పోను ఈ మూడు థియేటర్ల ద్వారా అల్లు అర్జున్ ఏడాదికి 10 కోట్ల రూపాయల లాభాలు అందుకుంటున్నారని తెలుస్తోంది.

ఏడాదికి 40 కోట్లు..

ఇలా బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్ అలాగే థియేటర్ల ద్వారా ఈయన ఏడాదికి 40 కోట్ల రూపాయల ఆదాయం అందుకుంటున్నారు. ఇక థియేటర్ బిజినెస్ లో అడుగు పెట్టడంతో ఒకేసారి థియేటర్ల పై పెట్టుబడి పెడుతూ ప్రతి ఏడాది భారీగా లాభాలను అందుకుంటున్నారనే విషయం తెలియడంతో బిజినెస్ లోకి అడుగు పెడితే ఒక పద్ధతి, ప్లానింగ్ ఉండాలి ఆ విషయంలో అల్లు అర్జున్ సరైన ప్లానింగ్ అమలు చేశారంటూ పలువురు ఈ విషయంపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఈయన రాకా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులను జరుపుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ మేకర్స్ ఇవ్వని నేపథ్యంలో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

Related News

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

శర్వా భుజం పై వాలిన డింపుల్.. తెర పైకి కొత్త రూమర్లు?

వాయిదా పడ్డ నితిన్ ‘అలియాస్ రుక్మిణి’.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

నాగచైతన్య బర్త్ డే.. లిప్ లాక్ తో శోభిత స్పెషల్ విషెస్!

ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘రికార్డ్’ పోస్టర్!

కార్తీక్ పాత్రకు ప్రాణం పోసిన శ్రీనాథ్.. ENE రిపీట్ తో భారీ క్రేజ్!

Big Stories

Advertisement
×