E-Paper
Advertisement

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?

టాలీవుడ్‌ను ఏలుతున్న తెలంగాణ దర్శకులు.. ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే?
Advertisement

Telangana Directors Remuneration:ఒకప్పుడు టాలీవుడ్ లో దర్శకులంటే ఆంద్రాప్రాంతానికి చెందినవారే.కాని ఇపుడు కాలం మారింది.తెలంగాణా నుండి కూడా ఎంతో మంది దర్శక ప్రతిభావంతులు వెండి తెర మీద తమ సత్తా చాటుతున్నారు.మరి ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో తమ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్న ఈ తెలంగాణా సినీ దర్శకులు అసలు ఒక్కో సినిమాకి ఎంత పారితోషికం పుచ్చుకుంటున్నారో ఒకసారి చూసేద్దాం.

సందీప్ వంగా

Advertisement

ముందుగా టాలీవుడ్ ని షేక్ చేస్తున్న దర్శకుడు ఎవరా అని చూస్తే అందరి వేళ్ళు సందీప్ వంగా వైపే చూపిస్తాయి.వరంగల్ నుండి వచ్చిన సందీప్ అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేశాడు.ఈ సినిమా ఇచ్చిన జోష్ తో బాలీవుడ్ బాట పట్టి కభీర్ సింగ్ సింగ్ ,యానిమల్ తీసిన సందీప్ ఇపుడు ప్రభాస్ తో ఫౌజీ చేస్తున్న సంగతి తెల్సిందే.ఇక ప్రభాస్ సినిమాకి తనే ఒక ప్రొడ్యూసర్ కావడం విశేషం.అయితే ప్రస్తుతం సందీప్ తో సినిమా చేయాలంటే మాత్రం 50 కోట్ల 70 కోట్ల వరకు అలాగే, లాభాల్లో వాటా కూడా ఇవ్వాల్సిందే అన్న టాక్ వినిపిస్తుంది.

నాగ్ అశ్విన్

Advertisement

ఇక ..ఎవడె సుబ్రహ్మణ్యం ,మహానటి,కల్కి 2898ad సినిమలాతో సత్తా చాటిన నాగ్ అశ్విన్ నాగర్ కర్నూల్ అని చెప్పక్కర్లేదు.ఇక ప్రస్తుతం కల్కి 2898ad కి సీక్వెల్ చేస్తున్న నాగీతో గనుక సినిమా చేయాలంటే 40 కోట్ల పైనే సమర్పించుకోవాలని ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట.

వంశీ పైడిపల్లి

నిర్మల్ కి చెందిన వంశీ పైడిపల్లి బృందావనం. ఊపిరి , మహర్షి , వారసుడు వంటి సినిమలాతో అలరించిన సంగతి తెల్సిందే.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తున్న వంశీ 25 కోట్లు తీసుకున్తున్నాడని నెట్టింట వినిపిస్తున్న వార్త.

సుజిత్

ఇక రన్ రాజా రన్ ,,సాహో ,ogలతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు పొందిన సుజిత్ ది హైదరాబాద్ అని చెప్పక్కర్లేదు.ఇక ప్రస్తుతం నాని తో బ్లడీ రోమియో ని పట్టాలెక్కించిన సుజిత్ దాదాపు
20 కోట్లు అందుకుంటున్నాడని ఇన్ సైడ్ టాక్ .

శ్రీకాంత్ ఓదెల

ఇక శ్రీకాంత్ ఓదెల విషయానికి వస్తే పెద్దపల్లి జిల్లాకి చెందిన ఈ క్రేజీ యంగ్ ఫిలిమ్ మేకర్ దసరా ,ప్యారడైజ్ లతో మనల్ని పలకరించిన సంగతి తెల్సిందే.ఇక ప్యారడైజ్15 కోట్లు పుచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఆ సినిమా బోల్తా కొట్టడంతో కాస్త తగ్గించుకున్నట్టు సమాచారం.

హరీష్ శంకర్

ఇక జగిత్యాలకి చెందిన హరీష్ శంకర్ విషయానికి వస్తే సినిమాకి 12 కోట్లు పుచ్చుకుంటున్నాడని టాక్.అయితే గబ్బర్ సింగ్ ,మిరపకాయ్ , దువ్వాడ జగన్నాథం,గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో సత్తా చాటిన హరీష్ మిస్టర్ బచ్చన్ , ఉస్తాద్ భగత్ సింగ్ లతో బోల్తా కొట్టిన సంగతి తెల్సిందే.

శేఖర్ కమ్ముల

ఇక సెన్సిబుల్ ఫిలిమ్ మేకర్ గా ముద్ర పడ్డ శేఖర్ కమ్ములది హైదరాబాద్ అన్న సంగతి తెల్సిందే. ఆనంద్ ,హ్యాపీ డేస్ , గోదావరి ,ఫిదా , కుభేర అవంతి బ్యూటిఫుల్ ఫిలిమ్స్ తీసిన ఈయన ఒక్కో సినిమాకి 8 కోట్లు పుచ్చుకుంటున్నాడని సమాచారం.

ALSO READ:పూజా నాగేశ్వర్ డాన్స్ చేసిన టాప్ 5 సాంగ్స్.. ఇదెక్కడి క్రేజ్ రా మావా!

సురేందర్ రెడ్డి

ఇక ఏజెంట్ తో డీలా పడ్డ సురేందర్ రెడ్డి ప్రస్తుతం పవన్ తో సినిమా ప్రయత్నాల్లో ఉన్నట్టు వినిపిస్తుంది. ఇక కరీంనగర్ కి చెందిన ఈ స్టైలిష్ డైరెక్టర్ అతనొక్కడే , కిక్ ,రేసు గుర్రం ,సైరా ,ధ్రువ అవంతి సాలిడ్ ఫిలిమ్స్ తీసిన సంగతి తెల్సిందే.ఇక ఈ ఈయన పారితోషికం 9 కోట్లని టాలీవుడ్ టాక్ .

ఇక సంపత్ నంది విషయానికి వస్తే పెద్దపల్లికి చెందిన ఈయన ఏమైంది ఈవేళ ,రచ్చ ,బెంగాల్ టైగర్ , సిటీ మార్ లతో పలకరించిన సంగతి తెల్సిందే.ఇక ప్రస్తుతం భోగి కి సంపత్ 5కోట్ల వరకు అందుకుంటున్నాడట.

kv అనుదీప్

ఇక సంగారెడ్డికి చెందిన kv అనుదీప్ 4 కోట్లు జాతి రత్నాలు , ప్రిన్స్ సినిమాలతో ప్రూవ్ చేసుకోగా ఫంకీ సినిమాకి 3 కోట్ల వరకు తీసుకున్నాడని టాక్.ఇక హైదరాబాద్ కి చెందిన సంకల్ప్ రెడ్డి ఘాజీ ,అంతరిక్షం తో అలరించిన సంగతి తెల్సిందే. ఇక భరత వర్ష అంటూ ఇపుడు గోపీచంద్ తో చేస్తున్న సినిమాకి మూడు కోట్లు ముట్టుకుంటున్నాడని వినికిడి.

ఇక పెళ్లి చూపులు ,ఈ నగరానికి ఏమైంది, కీడా కోలాలతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ene రిపీట్ కి 3కోట్ల వరకు అందుకున్నాడని తెలుస్తుంది.ఇక ఈయనది వరంగల్ అన్న సంగతి తెల్సిందే.ఇక బలగం తీసి ఎల్లమ్మతో పలకరిస్తున్న వేణు ఎల్దండి రాజన్న సిరిసిల్ల అని చెప్పక్కర్లేదు.ఇక ప్రస్తుతం ఈయన కూడా దాదాపు రెండు వరకు అందుకుంటున్నాడని టాక్ .

వేణు ఉడుగుల

ఇక వరంగల్ కి చెందిన వేణు ఉడుగుల ప్రస్తుతం చేయబోయే సినిమా కోసం దాదాపు రెండు కోట్లు పుచ్చుకుంటున్నాడని టాక్ .నీది నాది ఒకే కథ ,విరాట పర్వం వంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన ఈయన ముందు ముందు ఎలాంటి సినిమాలతో పలకరిస్తాడో చూడాలి.ఎపిక్ ,90’s బయోపిక్ వంటి ప్రాజెక్ట్స్ చేసిన ఆదిత్య హసన్ ది వనపర్తి అని చెప్పక్కర్లేదు.ఇక ఎపిక్ తో బోల్తా పడ్డ ఆదిత్య ప్రస్తుతం కోటి వరకు తీసుకుంటున్నాడని సమాచారం.

ALSO READ:అప్పుడు గాజులు గలగల.. ఇప్పుడు అయ్యప్ప మాల.. మళ్లీ వచ్చేసిందే!

Tags

Related News

బన్నీ సినిమాలు చేయకున్నా ఏడాదికి రూ.40  కోట్ల ఆదాయం .. ప్లానింగ్ అంటే ఇలా ఉండాలి!

సెన్సార్ పూర్తి చేసుకున్న నాగచైతన్య ‘వృషకర్మ’ .. ఏ సర్టిఫికెట్ వచ్చిందంటే?

రష్మిక మైసా కొత్త రిలీజ్ డేట్ లాక్.. ఎప్పుడంటే?

శర్వా భుజం పై వాలిన డింపుల్.. తెర పైకి కొత్త రూమర్లు?

వాయిదా పడ్డ నితిన్ ‘అలియాస్ రుక్మిణి’.. కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

నాగచైతన్య బర్త్ డే.. లిప్ లాక్ తో శోభిత స్పెషల్ విషెస్!

ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్.. ఆసక్తి రేపుతున్న కిరణ్ అబ్బవరం ‘రికార్డ్’ పోస్టర్!

Big Stories

Advertisement
×