Mohan Babu Look: నాని(Nani) ప్రధాన పాత్రలో శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “ది ప్యారడైజ్”. (The Paradise)ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26వ తేదీ ఏకంగా ఎనిమిది భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం నాని బ్లాక్ బస్టర్ హిట్ అందుకోబోతున్నారని తెలుస్తోంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి వరుసగా రెండు అప్డేట్స్ విడుదల చేయటంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో విలన్ పాత్రలో కలెక్షన్ కి మోహన్ బాబు(Mohan Babu) నటించబోతున్నారంటూ ఇదివరకు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మోహన్ బాబు లుక్ కి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. నేడు ఉదయం మోహన్ బాబును శింకజ్ మాలిక్(shikanja Malik ) గా పరిచయం చేస్తే ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా మోహన్ బాబు షర్టు లేకుండా చేతిలో గన్ పట్టుకొని సిగరెట్ కాలుస్తూ ఉన్న పోస్టర్ విడుదల చేయడంతో ఈ పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా కొన్ని విమర్శలను కూడా ఎదుర్కొంది. అయితే తాజాగా మరొక పోస్టర్ కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్ లో భాగంగా ఈయన గన్ పట్టుకొని కనిపిస్తూ చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేస్తూ… “శింకజ్ మాలిక్ బ్రూటల్, మ్యాడ్ మాన్, స్వాగ్ స్టైల్..యూనిక్ అతను విలనిజాన్ని పునర్ నిర్మించడానికి కాదు, పూర్తిగా తిరగరాయడానికి వస్తున్నారు” అంటూ ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్టర్ పై అభిమానులు విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు. ఉదయం విడుదల చేసిన పోస్టర్ పై విమర్శలు రావడంతోనే ఈ పోస్టర్ విడుదల చేశారా అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. ఉదయం రిలీజ్ చేసిన పోస్టర్ లో మోహన్ బాబు లుక్ పెద్దగా బాగాలేదని, విగ్ వాడారని, ఈ వయసులో ఈ జనరేషన్ హీరోలకు విలన్ గా సెట్ అవ్వరు అంటూ ఎన్నో విమర్శలు వచ్చాయి.
The legend @themohanbabu Garu as ‘SHIKANJA MAALIK’ 🦜🔥
Brutal. Madman. Swag. Style. Unique.
He is coming to not just redefine, but to rewrite villainism ❤🔥#TheParadise in CINEMAS 𝟐𝟔𝐭𝐡 𝐌𝐀𝐑𝐂𝐇, 𝟐𝟎𝟐𝟔.
Releasing in Telugu, Hindi, Tamil, Kannada, Malayalam,… pic.twitter.com/yO1RhqlvRW— THE PARADISE (@TheParadiseOffl) September 27, 2025
ఇలా విమర్శలు రావడంతోనే రెండో పోస్టర్ కూడా విడుదల చేశారు అంటూ ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. కానీ చిత్ర బృందం ముందుగా పథకం ప్రకారమే రెండు పోస్టర్లను విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా ఇలా రెండు పోస్టర్లను విడుదల చేయటం అనేది చిత్ర బృందం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారని, గతంలో కూడా నాని ఫస్ట్ లుక్ విడుదల చేసిన సమయంలో ఉదయం ఒకటి సాయంత్రం ఒక పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా మోహన్ బాబు పాత్రను కూడా పరిచయం చేస్తూ ఇలా రెండు పోస్టర్లను వదిలారు. ఇక ఈ సినిమా మార్చి26, 2026 న ఏకంగా 8 భాషలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలని పెంచేసాయి.
Also Read: Raj Kundra: మరో వివాదంలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా… ఈసారి ఏంటంటే?