Siva Karthikeyan : ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ అంతా కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా అన్ని భాషల సినిమాలను కూడా చూడటం మొదలుపెట్టారు. ముఖ్యంగా హరీష్ శంకర్ లాంటి దర్శకులు కూడా, మన తెలుగు వాళ్లకి మన సినిమాలు ఎక్కువ కదా వేరే సినిమాలు చూస్తారు కదా అంటూ మలయాళం సినిమా గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలానే తెలుగు ప్రేక్షకులు కూడా మలయాళం సినిమాలను ఆదరిస్తున్నారు. ఒక సినిమా బాగుంటే దానికి భాషతో సంబంధం లేదు అని చాలా సినిమాలు నిరూపించాయి. అందుకే తమిళ్ హీరోల సినిమాలు కూడా ఇక్కడ మంచి రెవెన్యూ సాధిస్తాయి. కొన్నిసార్లు తమిళ్లో కంటే కూడా ఇక్కడే మొదటి షో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి . లియో విషయంలో అదే జరిగింది. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో శివ కార్తికేయన్ ఒకరు. శివ కార్తికేయన్ చేసిన ప్రతి సినిమా కూడా ప్రస్తుతం తెలుగులో కూడా విడుదలవుతుంది.
శివ కార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో మదరాసి అనే సినిమాను చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు ఈవెంట్ రీసెంట్ గా జరిగింది. ఆ ఈవెంట్లో మీ సినిమాల్లో గెస్ట్ రోల్ గా ఒక హీరో ఉండాలి అనుకుంటే ఎవర్ని చూస్ చేసుకుంటారు అనే ప్రశ్న శివ కార్తికేయన్ కు ఎదురైంది. శివ కార్తికేయన్ ఏమీ ఆలోచించకుండా వెంటనే ఎన్టీఆర్ అంటూ చెప్పాడు. దీనిని బట్టి చూస్తే మదరాసి సినిమాలో గెస్ట్ రోల్ కాకపోయినా కూడా ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ ఒక సినిమాలో కనిపించిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదు.
ఇకపోతే ఎన్టీఆర్ చాలా సినిమాల్లో గెస్ట్ రోల్ గా చేశాడు. చింతకాయల రవి సినిమాలో ఒక పాటలో వచ్చి కనిపిస్తాడు. అయితే ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితమే హృతిక్ రోషన్తో కలిసి నటించిన వార్ 2 సినిమా కూడా విడుదలైంది. ఇంక రామ్ చరణ్ తో కలిసి చేసిన త్రిబుల్ ఆర్. సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సలార్ సినిమా తర్వాత ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వం వహిస్తున్న సినిమా డ్రాగన్.
Also Read: Naga Chaitanya Samantha : సమంత కేసు… మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన నాగార్జున, నాగ చైతన్య