Naga Chaitanya Samantha : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న చాలా ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ ఒకటి. అక్కినేని ఫ్యామిలీకి మంచి గౌరవం కూడా ఉంది. ప్రస్తుతం నాగార్జున, నాగచైతన్య, అఖిల్ వీళ్లంతా కూడా సినిమాల్లో చాలా యాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యంగా నాగచైతన్య విషయానికి వస్తే ఏ మాయ చేసావే సినిమాతో సమంత తో మంచి పరిచయం ఏర్పడింది.
నాగచైతన్య సమంత కలిసి నటించిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. అయితే అప్పటినుంచి వీళ్లిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. అది ప్రేమగా మారి వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. క్రిస్టియన్ మ్యారేజ్ తో పాటు హిందూ సాంప్రదాయకంగా కూడా ఇద్దరూ ఒకటయ్యారు. అయితే కొన్ని కారణాల వలన వీరిద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే.
నాగచైతన్య కి సమంత కి మధ్య విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే అవి ఏరోజు కూడా ఇద్దరూ బయట పెట్టలేదు. అయితే ఒక తరుణంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ప్రత్యర్థ్య నాయకుడు కేటీఆర్ ని విమర్శిస్తున్న తరుణంలో, కేటీఆర్ వల్లనే సమంత నాగచైతన్య విడిపోయారు అంటూ చెప్పారు. అలానే అతని వల్ల చాలామంది సెలబ్రిటీల జీవితాలు నాశనం అయిపోయాయి అని కామెంట్ చేశారు.
అంతేకాకుండా ఎన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరికి పంపమని కేటీఆర్ అడిగారని అప్పట్లో కొండ సురేఖ మాట్లాడిన మాటలు తీవ్రమైన చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆ కామెంట్స్ వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై అప్పట్లో కోర్టును కూడా ఆశ్రయించారు అక్కినేని ఫ్యామిలీ.
ఇక తాజాగా నాంపల్లి లోని మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున అతని తనయుడు అక్కినేని నాగ చైతన్య ఇద్దరు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ పై చేసిన వ్యాఖ్యల పై ఇద్దరి స్టేట్మెంట్ రికార్డు జడ్జీ రికార్డు చేశారు. అయితే దీనిని బట్టి కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also Read : Kishkindapuri : బెల్లంకొండ అసలు తగ్గట్లేదు, మిరాయి తో పోటీకి సిద్ధం