ICC ODI Rankings : క్రికెట్ లో ఏం జరుగుతుందో మనం ఊహించడం కష్టంతో కూడుకున్నపనే. ఎందుకు అంటే..? ఎప్పుడూ ఏ ఆటగాడు రాణిస్తాడో తెలియదు. ఎప్పుడూ ఏ ఆటగాడు చెత్త ప్రదర్శన కనబరుస్తాడో కూడా అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా పలువురు ఆటగాళ్లతో పాటు పలు జట్లు కూడా ఎప్పుడూ ఏ జట్టు రాణిస్తుందో..ఎప్పుడు ఏ జట్టు ఓటమి పాలవుతుందో చెప్పలేము. ముఖ్యంగా ఆటగాళ్లు రాణిస్తే.. ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఆటగాళ్లు బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలో ప్రతిభ కనబరిచినప్పుడే ఆ టీమ్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ( ICC ODI Rankings ) ఇంగ్లాండ్ (England) జట్టును వెనక్కి నెట్టి టాప్ 7లో కొనసాగుతోంది అప్గానిస్తాన్ జట్టు.
Also Read : Sikandar Raja : ఎవర్రా వీడు.. 39 ఏళ్ల వయసులో నెంబర్ వన్ ఆల్రౌండర్ గా చరిత్ర.. ఇంతకీ ఎవరీ సికిందర్ రాజా
అప్గానిస్తాన్ 7వ స్థానంలో..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం అప్గానిస్తాన్ జట్టు 7వ స్థానంలో కొనసాగుతుండగా.. ఇంగ్లాండ్ జట్టు 8వ స్థానంలో కొనసాగుతోంది. అంతకు ముందు అప్గానిస్తాన్ 9, 8వ స్థానంలో ఉండేది. పాకిస్తాన్ తో విజయం సాధించిన తరువాత పలు రికార్డులను నమోదు చేసుకుంది అప్గానిస్తాన్ జట్టు. అప్గానిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ క్రిడిట్ ఇవ్వాల్సిందే. తన జట్టు గెలుపు కోసం తాను పోరాడటమే కాకుండా తమ జట్టు ఆటగాళ్లను కూడా మోటివేట్ చేస్తూ విజయాలను సాధిస్తున్నాడు కెప్టెన్ రషీద్. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్ లను పరిశీలించినట్టయితే.. టీమిండియా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టీమిండియా 36 మ్యాచ్ లు ఆడితే 4471 పయఆయింట్లతో 124 రేటింగ్ తో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇండియా తరువాత న్యూజిలాండ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. మొత్తం 38 మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ జట్టు 4160 పాయింట్లతో.. 109 రేటింగ్ తో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో కొనసాగుతోంది. 35 మ్యాచ్ లు ఆడిన 3717 పాయింట్లతో..103 రేటింగ్ కొనసాగుతోంది. శ్రీలంక జట్టు 4వ స్థానంలో కొనసాగుతోంది. శ్రీలంక జట్టు మొత్తం 41 మ్యాచ్ లు ఆడగా.. 4235 పాయింట్లతో పాటు 103 రేటింగ్ తో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది శ్రీలంక జట్టు.
టీమిండియా నెంబర్ వన్..
టాప్ 5లో పాకిస్తాన్ జట్టు కొనసాగుతోంది. పాక్ జట్టు మొత్తం 35 మ్యాచ్ లు ఆడితే.. 3493 పాయింట్లతో 100 రేటింగ్ తో 5వ స్తానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా 33 మ్యాచ్ లు ఆడి 3284 పాయింట్లతో పాటు 100 రేటింగ్ తో 6వ స్థానంలో కొనసాగుతోంది. ఇక అప్గానిస్తాన్ జట్టు 25 మ్యాచ్ లు ఆడి 2279 పాయింట్లతో పాటు 91 రేటింగ్ తో 7వ స్థానానికి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ జట్టు 35 మ్యాచ్ లు ఆడి 3051 పాయింట్లతో పాటు 87 రేటింగ్ తో 8 వ స్థానంలో కొనసాగుతోంది. వెస్టిండిస్ జట్టు 09వ స్థానంలో కొనసాగుతోంది. ఋ జట్టు 35 మ్యాచ్ లు ఆడగా.. 2814 పాయింట్లతో పాటు 80 రేటింగ్ తో 09వ స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్ జట్టు 32 మ్యాచ్ లు ఆడితే 2465 పాయింట్లతో పాటు 77 రేటింగ్ తో 10వ స్థానంలో కొనసాగుతోంది. జింబాబ్వే 11, ఐర్లాండ్ 12, స్కాట్లాండ్ 13, యూఎస్ఏ 14, నెదర్లాండ్ 15, ఓమన్ 16, నేపాల్ 17, నమీబియా 18, కెనడా 19, యూఏఈ 20వ స్థానాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా నెంబర్ స్థానంలో కొనసాగడం శుభపరిణామం అనే చెప్పవచ్చు.